ఈటల కమిషన్‌ విచారణ కీలక దశలోకి…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఈటల కమిషన్‌ విచారణ కీలక దశలోకి….

Homeతెలంగాణ

ఈటల కమిషన్‌ విచారణ కీలక దశలోకి….

ఈటల కమిషన్ ముందు హాజరు – కాళేశ్వరం విచారణ కీలక దశలోకి. హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కీలక

కమిషన్ ఎదుట కేసీఆర్ – కాళేశ్వరం విచారణలో కీలక మలుపు!
ఉగ్రదాడి.. ట్యాంక్ బండ్పై నిరసన….
ఈటల రాజేందర్ కాళేశ్వరం విచారణలో ప్రశ్నించబడిన దశ పూర్తిచేశారు।

ఈటల కమిషన్ ముందు హాజరు – కాళేశ్వరం విచారణ కీలక దశలోకి.
హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కీలక దశకు చేరింది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ ముందు ఈటల రాజేందర్‌ ఇవాళ హాజరవుతున్న విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 10 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో కమిషన్‌ కార్యాలయంలో విచారణ జరగనుంది.
కమిషన్‌ సభ్యులు ఈటలపై పలు ఆర్థిక అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా NDSA నివేదిక, డిజైన్ లోపాలు, నాణ్యత లోపాలు, ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలు వంటి కీలక అంశాలపై ఈటల రాజేందర్‌ను ప్రశ్నించనున్నారు. అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ధనల వినియోగం, అనుమతుల ప్రక్రియ వంటి అంశాలపై కమిషన్‌ స్పష్టత పొందాలనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రత్యేకంగా ప్రశ్నావళిని సిద్ధం చేసినట్టు సమాచారం. ఈటల ఇవ్వనున్న వాంగ్మూలం కమిషన్‌ తుది నివేదికపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
ఇక ఈ విచారణ అనంతరం జూన్ 9న మాజీ మంత్రి హరీష్ రావు, జూన్ 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగనున్న ఈటల కమిషన్ హాజరు రాజకీయంగా, పరిపాలనా పరంగా తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది.

Arukaleoverseas consultancy – instagram post

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube