జూన్-జులైలో పంచాయతీ ఎన్నికలు..? ఎన్నికల సంఘం సిద్ధంగా! - Digital Prime News - Latest Telugu News Digital Prime News

జూన్-జులైలో పంచాయతీ ఎన్నికలు..? ఎన్నికల సంఘం సిద్ధంగా!

Homeతెలంగాణ

జూన్-జులైలో పంచాయతీ ఎన్నికలు..? ఎన్నికల సంఘం సిద్ధంగా!

స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, తెలంగాణ: రాష్ట్రంలో ఎంతోకాలంగా ఆలస్యం అవుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే

కడపలో మహానాడు రెండో రోజు కొనసాగింపు…
జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు? అధికారులకు సీఎం కీలక ఆదేశాలు….
సహచర ఎమ్మెల్యే మరణం మధ్య వివేక్ ఇంట్లో సంబరాలు….

స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, తెలంగాణ: రాష్ట్రంలో ఎంతోకాలంగా ఆలస్యం అవుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లకు మునుపే ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోంది.
ఇటీవల గ్రామ పంచాయతీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.153 కోట్ల బిల్లులను క్లియర్ చేసిన ప్రభుత్వం, త్వరలోనే మరో రూ.300 కోట్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిని ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ముందు ప్రజల మద్దతు పొందే వ్యూహంగా భావిస్తోంది.
జూన్ 2 నుంచి ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో యువత కోసం స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది ప్రభుత్వం. అదే నెలలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయాలని కూడా నిర్ణయించింది.
ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనలు కొనసాగిస్తూ, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా సమావేశమవుతున్నారు. ఇది పార్టీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా జరుగుతున్నదన్న టాక్ ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
జూన్ చివర్లో లేదా జులై మొదటివారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తూ, ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని తెలిసింది. రిజర్వేషన్లు, తేదీలపై క్లారిటీ వచ్చేందుకు ఎదురుచూస్తున్నట్టు సమాచారం.
ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న కాంగ్రెస్ హామీ అమలు దశలో ఉంది. సంబంధిత రెండు బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం కులగణన ప్రక్రియ ప్రారంభించడంతో, రాష్ట్రానికి ఆమోదం వస్తుందా? అనేది సందేహంగా మారింది. అందువల్ల పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు 2023 ఫిబ్రవరిలోనే ముగియడంతో, కేంద్రం నుంచి వచ్చే రూ.1,600 కోట్లకు పైగా ఆర్థిక సంఘ నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామీణ అభివృద్ధి పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజల అసంతృప్తిని నివారించేందుకు ప్రభుత్వం త్వరలోనే ఎన్నికలు జరిపే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

websoft Digital Media- website Design and development

websoft Digital Media- website Design and development

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube