రూ.15.85 లక్షల జీతానికి టాక్స్ లేకుండా అవకాశం?

రూ.15.85 లక్షల జీతానికి టాక్స్ లేకుండా అవకాశం?

Homeబిజినెస్

రూ.15.85 లక్షల జీతానికి టాక్స్ లేకుండా అవకాశం?

New Tax Regime: రూ.15.85 లక్షల జీతానికి కూడా టాక్స్ లేకుండా అవకాశం.. ఎలా అంటే? దేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థలో ప్రస్తుతం పాత, కొత్త విధానాలు అమల్లో ఉన్

GHMCలో రూ.5కే టిఫిన్ – ఇందిరమ్మ క్యాంటీన్ పూర్తి మెనూ ఇదే!
భారీ లాభాల్లో ఆటో షేర్లు.. కారణమిదే…
lic న్యూ చిల్డ్రన్స్ ప్లాన్ విశ్లేషణ…..

New Tax Regime: రూ.15.85 లక్షల జీతానికి కూడా టాక్స్ లేకుండా అవకాశం.. ఎలా అంటే?

దేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థలో ప్రస్తుతం పాత, కొత్త విధానాలు అమల్లో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో New Tax Regime ను ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లను తగ్గించడం, టాక్స్ రిబేట్ పరిమితిని పెంచడం, స్టాండర్డ్ డిడక్షన్ పెంపు వంటి చర్యలతో వేతన జీవులకు ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలుగా ఉండగా, రూ.12 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ రిబేట్ వర్తిస్తుంది. అంటే మొత్తం రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అయితే కొన్ని ప్రత్యేక మినహాయింపులను ఉపయోగించుకుంటే ఇంకా ఎక్కువ ఆదాయంపైనా టాక్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కంపెనీలు అందించే మీల్ వోచర్లు (సోడెక్సో కార్డులు వంటి) ద్వారా ప్రతి మీల్‌కు రూ.200 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. రోజుకు రెండు మీల్స్ లెక్కన చూస్తే నెలకు రూ.8,800 వరకు టాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సంవత్సరానికి ఇది రూ.1,05,600 వరకు మినహాయింపుగా మారుతుంది. అదనంగా యజమాని చెల్లించే Employees Provident Fund (EPF) కాంట్రిబ్యూషన్ కూడా పన్ను రహితం. బేసిక్ పేలో 12 శాతం వరకు ఇది వర్తిస్తుంది.

ఇక National Pension System (NPS) పథకంలో యజమాని జమ చేసే మొత్తం కూడా పన్ను మినహాయింపులోకి వస్తుంది. బేసిక్ పేలో గరిష్టంగా 14 శాతం వరకు మినహాయింపు పొందొచ్చు. ఉదాహరణకు రూ.15.85 లక్షల వార్షిక ఆదాయంపై ముందుగా స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000 మైనస్ చేస్తే రూ.15.10 లక్షలు మిగులుతాయి. ఆపై మీల్ వోచర్ల ద్వారా రూ.1,05,600 తీసేస్తే రూ.14,04,400 అవుతుంది. అక్కడి నుంచి EPF రూ.95,100, NPS రూ.1,10,950 మినహాయిస్తే మొత్తం పన్ను వర్తించే ఆదాయం రూ.11,98,350కి తగ్గుతుంది. ఇది రూ.12 లక్షల్లోపే ఉండటంతో టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

పాత పన్ను విధానంలో మాత్రం Public Provident Fund, Sukanya Samriddhi Yojana, హోం లోన్, ఇన్సూరెన్స్, ట్యూషన్ ఫీజులు వంటి పెట్టుబడులపై మినహాయింపులు ఎక్కువగా లభిస్తాయి. కానీ కొత్త పన్ను విధానంలో తక్కువ స్లాబ్ రేట్లు, ఎక్కువ రిబేట్ పరిమితితో పన్ను భారం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో మధ్య తరగతి వేతన జీవులు తమ ఆదాయానికి తగ్గట్టు సరైన పన్ను విధానాన్ని ఎంచుకోవడం కీలకంగా మారింది.

Disclaimer: పై సమాచారం అవగాహన కోసం మాత్రమే. పన్ను చట్టాలు, వ్యక్తిగత ఆదాయం, పెట్టుబడుల ఆధారంగా మార్పులు ఉండొచ్చు. పెట్టుబడులు లేదా పన్ను ప్రణాళిక కోసం ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలువేగంగా అందించే Digital Prime News‌ తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube