అమరావతికి రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లు.. కీలక నిర్ణయం

అమరావతికి రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లు.. కీలక నిర్ణయం

Homeఆంధ్రప్రదేశ్

అమరావతికి రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లు.. కీలక నిర్ణయం

అమరావతికి హైస్పీడ్ రైలు కనెక్టివిటీ.. రెండు కారిడార్లతో కొత్త మార్పులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి త్వరలో దేశంలో కీలక రైల్వే హబ్‌గా మా

కనిపించని కళ్లతో ప్రపంచకప్ గెలిచిన కరుణకుమారి ప్రభావం.
నేటి నుండి తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభం…
ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి….

అమరావతికి హైస్పీడ్ రైలు కనెక్టివిటీ.. రెండు కారిడార్లతో కొత్త మార్పులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి త్వరలో దేశంలో కీలక రైల్వే హబ్‌గా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో రెండు అమరావతిని నేరుగా కనెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌ను అమరావతి మీదుగా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకోగా, తాజాగా బెంగళూరు – చెన్నై కారిడార్ విషయంలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదన మేరకు బెంగళూరు–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌ను చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా నాయుడుపేట వరకు లింక్ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో అమరావతికి చెన్నైతో పాటు బెంగళూరు, మైసూరు నగరాలతో కూడా హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే హైదరాబాద్ – చెన్నై కారిడార్ అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నై వరకు వెళ్తుంది. ఇక రెండో కారిడార్ నాయుడుపేట నుంచి తిరుపతి, చిత్తూరు, బంగారుపాళ్యం మీదుగా బెంగళూరు, మాండ్య ద్వారా మైసూరు వరకు విస్తరించనుంది.

మరోవైపు హైదరాబాద్ – బెంగళూరు హైస్పీడ్ కారిడార్ కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూర్చనుంది. ఈ మార్గం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా మీదుగా వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మూడు కారిడార్లతో ఆంధ్రప్రదేశ్‌లో రవాణా రంగంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

హైస్పీడ్ రైల్ కారిడార్లతో అమరావతి అభివృద్ధి వేగం పెరగడమే కాకుండా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది నాటికి డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే అమరావతి దేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుంది.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలువేగంగా అందించే Digital Prime News‌ తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube