చేవెళ్ల బస్సు ప్రమాదం: తాండూరు మూడు అక్కాచెల్లెళ్లు మృతి

చేవెళ్ల బస్సు ప్రమాదం: తాండూరు మూడు అక్కాచెల్లెళ్లు మృతి.

Homeతెలంగాణ

చేవెళ్ల బస్సు ప్రమాదం: తాండూరు మూడు అక్కాచెల్లెళ్లు మృతి.

చేవెళ్ల బస్సు ప్రమాదం: అయ్యో దేవుడా..! నా ముగ్గురు బిడ్డల్ని ఎవరు తీసుకొస్తారు..! తాండూరు తల్లి గుండెలవిసేలా రోదన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్ర

జబర్దస్త్ కొమురక్కపై దాడి.. అసిస్టెంట్ కారణంగా కలకలం
సౌదీ బస్సు ప్రమాదంలో 45 హైదరాబాదీలు మృతి – విషాదం
ప్రధాని మోదీ ఎర్రకోట పేలుడు బాధితులకు పరామర్శ.

చేవెళ్ల బస్సు ప్రమాదం: అయ్యో దేవుడా..! నా ముగ్గురు బిడ్డల్ని ఎవరు తీసుకొస్తారు..! తాండూరు తల్లి గుండెలవిసేలా రోదన

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం అనేక కుటుంబాలను కుదిపేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే ప్రమాదంలో మృతి చెందడం తాండూరులో తీవ్ర విషాదాన్ని నింపింది.

తాండూరు గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు తనూష, సాయి ప్రియ, నందిని ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల బంధువుల పెళ్లికి వచ్చి, పరీక్షలు ఉన్నాయని ఈ ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే మధ్యలో మిర్జాగూడ సమీపంలో బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ముగ్గురు హైదరాబాద్ కోఠి మహిళా కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో స్థిరపడతారనుకున్న కుమార్తెలు చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీళ్లతో మునిగిపోయారు.

నా ముగ్గురు బిడ్డల్ని ఎవరు తీసుకొస్తారు..?” అంటూ ఆ తల్లి ఆస్పత్రిలో విలపించడం, అక్కడున్న వారందరినీ కన్నీళ్లు పెట్టించింది.

అదే ప్రమాదంలో యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిలరెడ్డి అనే యువతి కూడా మరణించింది. ఆమె ఎంబీఏ చదువుతోంది. ఒకే ప్రమాదంలో నలుగురు యువతులు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

#DigitalPrimeNews #TeamIndia #WomensWorldCupFinal #IndiaVsAustralia #HarmanpreetKaur #JemimahRodrigues #WomenCricketHistory #CricketNews #TeluguNews #SportsUpdates #BreakingNews

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube