రామ్ చరణ్ మానవత్వం గుర్తు చేసిన మంచు మనోజ్…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

రామ్ చరణ్ మానవత్వం గుర్తు చేసిన మంచు మనోజ్….

Homeసినిమా

రామ్ చరణ్ మానవత్వం గుర్తు చేసిన మంచు మనోజ్….

టాలీవుడ్ హీరో మంచు మనోజ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా “భైరవం” ప్రమోషన్ల సందర్భంగ

తాజా సినీ ముచ్చట్లు…..
హిట్-3: తొలి రోజు రూ.43 కోట్ల కలెక్షన్స్….
‘హిట్-3′ నచ్చకపోతే ‘SSMB29’ చూడొద్దు: నాని 

టాలీవుడ్ హీరో మంచు మనోజ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా “భైరవం” ప్రమోషన్ల సందర్భంగా మనోజ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ సహాయక స్వభావాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.
మంచు మనోజ్ ఓసారి అమెరికా వెళ్లిన సమయంలో, దుబాయ్‌లో ఓ కుటుంబానికి వీసా సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. వారి ఇండియాకు తిరిగివచ్చేందుకు ₹5 లక్షలు అవసరమయ్యాయి. అప్పటికి తన ఖాతాలో డబ్బులు లేకపోవడంతో రామ్ చరణ్‌కు ఫోన్ చేసిన మనోజ్, పరిస్థితిని వివరించగానే చరణ్ వెంటనే అకౌంట్ నంబర్ అడిగి డబ్బులు పంపించారని చెప్పారు.
ఈ సంఘటన రామ్ చరణ్ మానవత్వాన్ని మరియు స్నేహంలో ఉన్న గొప్పతనాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.
ఇదిలా ఉండగా, మనోజ్ నటించిన “భైరవం” మూవీ మే 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించగా, విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళంలో విజయవంతమైన “గరుడన్” చిత్రానికి ఇది రీమేక్.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube