మార్కాపురం బస్సు ప్రమాదం.. ముందే హెచ్చరించిన ప్రయాణికులు

మార్కాపురం బస్సు ప్రమాదం.. ముందే హెచ్చరించిన ప్రయాణికులు

Homeఆంధ్రప్రదేశ్

మార్కాపురం బస్సు ప్రమాదం.. ముందే హెచ్చరించిన ప్రయాణికులు

మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది మృతి. బస్సు కండిషన్‌పై ముందే హెచ్చరించిన ప్రయాణికులు. సీఎం చంద్రబాబు సమీక్ష. మార్కాపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థ ప్రారంభం.
తెలంగాణ, ఏపీలో వర్షాలు… ఈదురుగాలులు కలకలం…
ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి….

మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది మృతి. బస్సు కండిషన్‌పై ముందే హెచ్చరించిన ప్రయాణికులు. సీఎం చంద్రబాబు సమీక్ష.

మార్కాపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాయవరం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కాగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి గురైన బస్సు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల నుంచి నెల్లూరుకు వెళ్తున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. బస్సు కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్‌కు తెలిపినట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం వద్ద కొద్దిసేపు బస్సును నిలిపివేసి మరమ్మతులు చేసినట్లు సమాచారం. అయితే మరమ్మతుల అనంతరం బస్సు తిరిగి బయలుదేరిన గంటలోపే ప్రమాదం జరిగినట్లు ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ఘోరం తప్పేదని వారు అంటున్నారు.

ప్రమాదానికి గురైన బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌ను విచారించగా స్టీరింగ్ స్టక్ అయినట్లు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రమాదానికి సాంకేతిక లోపాలే కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులతో సమీక్షించారు. టిప్పర్ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులు సజీవ దహనం కావడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు.

ఇదిలా ఉండగా బాధితుల సహాయార్థం అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. నెల్లూరు కలెక్టరేట్‌లో 7995575699, 08612331261 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే మార్కాపురం ఆర్డిఓ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఒంగోలు కలెక్టరేట్‌లో 1077 నెంబర్‌తో మరో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదనంగా 6304285613, 9985733999, 7989537285, 9703578434 నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. ఈ నంబర్ల ద్వారా బాధితుల సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండినిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube