హైదరాబాద్: మెట్రో రైల్ శుభవార్త! హైదరాబాద్ మహానగర వాసులకు గణేశ్ నిమజ్జనాల సందర్భంగా మెట్రో రైల్ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 6వ తేదీ
హైదరాబాద్: మెట్రో రైల్ శుభవార్త!
హైదరాబాద్ మహానగర వాసులకు గణేశ్ నిమజ్జనాల సందర్భంగా మెట్రో రైల్ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రైళ్లు నడుస్తాయని, అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారు జామున 1 గంటకు బయలుదేరి 2 గంటలకు గమ్యానికి చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు.
ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్ర దృష్ట్యా ఖైరతాబాద్, లక్డీకాపూల్ స్టేషన్లలో అదనపు సిబ్బంది, పోలీస్ భద్రతతో కఠిన నిఘా ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించి మెట్రో సిబ్బందికి సహకరించాలని మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇక తెలంగాణ ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను నడుపుతుండగా, దక్షిణ మధ్య రైల్వే కూడా ఎంఎంటీఎస్ ప్రత్యేక ట్రిప్పులను ఏర్పాటు చేస్తోంది. నిమజ్జనం రోజు రాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఈ సౌకర్యం కొనసాగుతుంది.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్‌సైట్ మరియు యూట్యూబ్ చానెల్‌ను ఫాలో అవ్వండి.

COMMENTS