హైదరాబాద్ మెట్రో రుణాన్ని కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు వి
హైదరాబాద్ మెట్రో రుణాన్ని కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, తొలి దశ స్వాధీనం అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన రుణ ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. జపాన్ ఆర్థిక సహకారంతో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ద్వారా అందాల్సిన రూ.13,600 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల కాకుండా నిలిపివేశారని ఆయన పేర్కొన్నారు.
సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మెట్రో విస్తరణ అత్యంత కీలకమని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో రెండో దశ విస్తరణకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. కేంద్రం సూచన మేరకు మొదటి దశను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీతో చర్చలు జరిపినా, నష్టాల కారణంగా సంస్థ రెండో దశలో భాగస్వామ్యం కావడానికి నిరాకరించిందని వెల్లడించారు.
దీంతో మొదటి దశ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, రెండో దశను స్వయంగా చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును రూ.15 వేల కోట్లకే టేకోవర్ చేసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా కేవలం 4 శాతం వడ్డీకే రుణం సమకూర్చేందుకు ఐఆర్‌ఎఫ్‌సీతో ఒప్పందాలు పూర్తయ్యాయని తెలిపారు.
అయితే, రుణం విడుదలకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత కూడా కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రక్రియను నిలిపివేశారని సీఎం ఆరోపించారు. తెలంగాణకు మెట్రో నిధులు అందకుండా అడ్డుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం నిధులు ఇస్తున్నప్పటికీ తెలంగాణ విషయంలో వివక్ష చూపుతోందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (NOC) ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే మెట్రో రెండో దశను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సహకరించాలని, కిషన్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి…
జీ7 సమ్మిట్‌లో మోదీ.. ట్రంప్‌తో కీలక భేటీ నేడు
అడవిలో అన్నలు లేరు.. టీఆర్‌ఎస్‌లో ఉన్నారు: కవిత సంచలన వ్యాఖ్యలు
స్కూల్ బస్సులపై ఆర్టీవో కొరడా.. 6 బస్సులకు చలాన్లు
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS