ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుండి శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుక
ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుండి శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ కొత్త విధానంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా సంవత్సరానికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందుతుంది. మొత్తం 1.63 కోట్ల కుటుంబాలు ఈ పథకంతో లబ్ధి పొందనున్నాయి.
ముఖ్యాంశాలు:
-
ఉచిత వైద్యం: ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స.
-
ఆసుపత్రులు: రాష్ట్రవ్యాప్తంగా 2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం.
-
చికిత్సలు: 3,257 రకాల చికిత్సలు ఉచితంగా అందుబాటులో.
-
వేగవంతమైన అనుమతులు: కేవలం 6 గంటల్లోనే ప్రీ-ఆథరైజేషన్ అనుమతులు.
-
ఫైనాన్సింగ్: రూ.2.5 లక్షల లోపు క్లెయిమ్‌లు ఇన్సూరెన్స్ పరిధిలోకి, ఆ పైగా 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ భరిస్తుంది.
అదనపు నిర్ణయాలు:
-
రాష్ట్రంలో పీపీపీ విధానంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు.
-
ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో కొత్త వైద్య కళాశాలలు.
ఈ నిర్ణయంతో కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య భద్రత కలగనుందని ప్రభుత్వం పేర్కొంది.

COMMENTS