అమరావతిలో బిట్స్ పైలాని క్యాంపస్ – రూ.2,200 కోట్లతో భారీ పెట్టుబడి అమరావతి, జూలై 13 (Digital Prime News):ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి గుడ్‌న్యూస్. దే
అమరావతిలో బిట్స్ పైలాని క్యాంపస్ – రూ.2,200 కోట్లతో భారీ పెట్టుబడి
అమరావతి, జూలై 13 (Digital Prime News):
ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి గుడ్‌న్యూస్. దేశంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS Pilani) తమ కొత్త క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా అధికారికంగా ప్రకటించారు.
ఈ కొత్త క్యాంపస్‌కు రూ.2,200 కోట్ల పెట్టుబడి అంచనా వేయగా, 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ విద్యా కాంప్లెక్స్‌ను AI+ డిజిటల్ ఫస్ట్ క్యాంపస్‌గా తీర్చిదిద్దనున్నారు. ఒకేసారి 7,000 మంది విద్యార్థులు చదివే విధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు.
ఉన్నత విద్యలో అమరావతికి మరో మెట్టు
BITS పిలాని ఇప్పటికే హైదరాబాద్, గోవా, దుబాయ్‌లో తమ క్యాంపసులను విజయవంతంగా నడుపుతోంది. ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్యాంపస్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత సాంకేతిక విద్యకు మరింత దిశానిర్దేశం కలిగించనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో BITS ప్రతినిధులు స్థల పరిశీలన చేపట్టి, అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు అనుకూలతలపై ప్రాథమిక సర్వేలు పూర్తయ్యాయని సమాచారం.
వెంకటపాలె బైపాస్ వద్ద ఈ క్యాంపస్ కోసం స్థలాన్ని పరిశీలించిన BITS ప్రతినిధులు, అమరావతిలో ఉన్న మౌలిక సదుపాయాలు, విద్యా వాతావరణం తమ నిర్ణయానికి బలమిచ్చినట్టు తెలుస్తోంది.
క్యాంపస్ లక్ష్యం – ప్రపంచ స్థాయి అవకాశాలు
కుమార మంగళం బిర్లా ప్రకారం, ఈ క్యాంపస్ ప్రధాన లక్ష్యం – ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రపంచ స్థాయి శిక్షణ, పరిశోధన, ఉపాధి అవకాశాలను అందించడమే. AI, IoT వంటి ఆధునిక రంగాల్లో ప్రత్యేక కోర్సులు, పరిశోధన కేంద్రాలు అమరావతిలోనే అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.
ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు:
-
స్థలం: అమరావతి (వెంకటపాలె వద్ద)
-
పెట్టుబడి: రూ.2,200 కోట్లు
-
విద్యార్థుల సామర్థ్యం: 7,000 మంది
-
తత్వం: Digital-First AI+ Campus
-
ఫోకస్: AI, Robotics, IoT, Quantum Tech, Startups
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS