Are Shyamala | వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్‌నే చదివా.. పోలీసుల విచారణలో నీళ్లు నమిలిన శ్యామల! వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల మళ్లీ వార్తల్లో నిలిచారు
Are Shyamala | వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్‌నే చదివా.. పోలీసుల విచారణలో నీళ్లు నమిలిన శ్యామల!
వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల మళ్లీ వార్తల్లో నిలిచారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై చేసిన వ్యాఖ్యలతో ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు హాజరైన శ్యామల, విచారణలో సమాధానాలు ఇవ్వడంలో ఇబ్బంది పడ్డారని సమాచారం.
కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన అంశాలపై అవాస్తవాలు ప్రచారం చేశారన్న ఆరోపణలతో గత నెల 30న కర్నూలు తాలుకా అర్బన్ పోలీస్ స్టేషన్‌లో 27 మందిపై కేసు నమోదు చేశారు. వీరందరికీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం శ్యామల విచారణకు హాజరయ్యారు.
విచారణ సందర్భంగా పోలీసులు — “ప్రమాదానికి ముందు శివశంకర్, ఎర్రిస్వామి మద్యం సేవించారని ఎవరు చెప్పారు? దానికి తగిన ఆధారాలున్నాయా?” అని ప్రశ్నించగా, శ్యామల సరైన సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు “అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేశావు?” అని ప్రశ్నించగా, ఆమె “పార్టీ ఆదేశాల మేరకే మాట్లాడానని” చెప్పినట్లు సమాచారం.
శ్యామల విచారణలో తాను వైసీపీ అధికార ప్రతినిధిగా మాత్రమే వ్యవహరించానని, వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారని చెబుతున్నారు.
తర్వాత తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆరె శ్యామల –
“వైసీపీ అధికార ప్రతినిధిగా పది ప్రశ్నలు అడిగాను. వాటిలో తప్పేముంది? విచారణ పేరుతో ఎన్ని సార్లు తిప్పినా, ఎన్ని కేసులు పెట్టినా నా పోరాటం ఆగదు,” అని స్పష్టం చేశారు.
ఆమె చేసిన వ్యాఖ్యలు, విచారణలో తీరుతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ వర్గాలు “శ్యామల విచారణలో తడబడ్డారు” అని వ్యాఖ్యానిస్తుండగా, వైసీపీ వర్గాలు మాత్రం “ఆమె పార్టీ తరపున మాట్లాడింది అంతే” అంటూ రక్షణగా నిలుస్తున్నాయి.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!
#DigitalPrimeNews #TeamIndia #WomensWorldCupFinal #IndiaVsAustralia #HarmanpreetKaur #JemimahRodrigues #WomenCricketHistory #CricketNews #TeluguNews #SportsUpdates #BreakingNews

COMMENTS