యెమెన్‌లో కేరళ నర్సుకు తాత్కాలిక రిలీఫ్: ఉరి వాయిదా.

యెమెన్‌లో కేరళ నర్సుకు తాత్కాలిక రిలీఫ్: ఉరి వాయిదా.

Homeజాతీయంఅంతర్జాతీయం

యెమెన్‌లో కేరళ నర్సుకు తాత్కాలిక రిలీఫ్: ఉరి వాయిదా.

డిజిటల్ ప్రైమ్ న్యూస్ – జూలై 15, 2025 యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు తాత్కాలిక ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్

కొత్త జీవితం కంటే ముందే… విషాద ముగింపు….
కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న కూంబింగ్…
మహిళల వన్డే ప్రపంచ కప్‌: భారత్ ఘన విజయం, పాకిస్తాన్‌పై 88 పరుగుల తేడా

డిజిటల్ ప్రైమ్ న్యూస్ – జూలై 15, 2025

యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు తాత్కాలిక ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తీవ్ర ప్రయత్నాల ఫలితంగా ఆమెకు విధించాల్సిన ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది.

ఎందుకు నిమిషా ప్రియపై ఉరిశిక్ష..?

కేరళకు చెందిన నిమిషా ప్రియ 2008లో నర్సింగ్ పూర్తి చేసి ఉద్యోగావకాశాల కోసం యెమెన్ దేశానికి వెళ్లింది. అక్కడ పలు ఆసుపత్రుల్లో నర్సుగా పనిచేసిన ఆమె, 2014లో యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తిని తన క్లినిక్ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంది.

కొంతకాలానికే వ్యాపారంలో సమస్యలు తలెత్తడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నిమిషా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడికి జైలుశిక్ష పడింది. జైలు నుండి విడుదలైన తలాల్, ఆమెను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. పాస్‌పోర్టు తీసేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు.

తట్టుకోలేక తీసుకున్న నిర్ణయం

తలాల్ వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో, నిమిషా అతడిని చంపాలని నిర్ణయించుకుంది. 2017లో తలాల్‌కు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసింది. ఆ తర్వాత ఇండియాకు తిరిగి రావడానికి ప్రయత్నించగా, యెమెన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఆమె అక్కడ జైల్లో ఉంది.

2023లో ఉరిశిక్ష విధింపు

యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ 2023లో ఆమెకు ఉరిశిక్ష విధించింది. అయితే, అక్కడి చట్టాల ప్రకారం, బాధితుడి కుటుంబానికి ‘బ్లడ్ మనీ’ (పరిహారం) చెల్లిస్తే ఉరిశిక్ష రద్దు చేయవచ్చు. దీంతో, ఆమె కుటుంబం డబ్బు సేకరించి బ్లడ్ మనీ చెల్లించేందుకు సిద్ధమైంది.

న్యాయవాదితో సమస్యలు

నిమిషా తరపున న్యాయవాది తన ఫీజు రూ.40,000 డాలర్లు ఇవ్వాలని, రెండు విడతలుగా చెల్లించవచ్చని తెలిపాడు. మొదటి విడత చెల్లించబడినప్పటికీ, రెండవ విడత డబ్బులు చెల్లించలేకపోయారు. ఈ నేపథ్యంలో 2024 సెప్టెంబర్‌లో బ్లడ్ మనీ ప్రక్రియ నిలిచిపోయింది.

జూలై 16 ఉరిశిక్ష తేదీగా ఖరారు

ఈ నెల 16వ తేదీ (జూలై 2025) నిమిష ప్రియను ఉరి తీయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, భారత ప్రభుత్వం తీవ్రంగా చర్చలు జరిపి చివరి క్షణంలో ఉరిశిక్ష అమలును వాయిదా వేయించగలిగింది. ప్రస్తుతం ఆమెను పూర్తిగా రక్షించేందుకు కేంద్రం యెమెన్ ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తోంది.


Key Highlights:

  • నర్సు నిమిషా ప్రియకు తాత్కాలిక ఊరట

  • యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్షను వాయిదా వేసింది

  • బ్లడ్ మనీ కోసం ఆమె కుటుంబం పోరాటం

  • కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా జోక్యం

  • ఇంతవరకు జైల్లోనే ఉన్న నిమిష ప్రియ


Digital Prime News Analysis:

నిమిషా ప్రియ కేసు అనేది అంతర్జాతీయ మానవ హక్కుల పరంగా కీలకమైన అంశంగా మారింది. ఓ భారతీయ మహిళ ఆ విదేశీ భూమిలో న్యాయపోరాటం చేస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదుర్కొంటోంది. భారత ప్రభుత్వం ఈ విషయంలో చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమైనవి.


More Updates Awaited

కేంద్రం ప్రయత్నాలపై ఇంకా నిర్ణయాత్మక ప్రకటన రావాల్సి ఉంది. యెమెన్ అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. పూర్తి విడుపుదల కోసం ఇంకా ఎత్తుగడలు కొనసాగుతున్నాయి.

రిన్ని  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube