450 కిలోమీటర్లు ప్రయాణించిన పులి.. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల మీదుగా.. సాధారణంగా పులులు తమ నివాస ప్రాంతం చుట్టూ తిరుగుతూ వేటాడుతుంటాయి. కానీ ఇట
450 కిలోమీటర్లు ప్రయాణించిన పులి.. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల మీదుగా..
సాధారణంగా పులులు తమ నివాస ప్రాంతం చుట్టూ తిరుగుతూ వేటాడుతుంటాయి. కానీ ఇటీవల ఒక మగపులి 450 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణించడం అటవీ అధికారులను ఆశ్చర్యపరిచింది. మహారాష్ట్రలోని దారుశివ జిల్లాలో మొదలైన ఈ పులి ప్రయాణం, తెలంగాణలోని ఆదిలాబాద్ అడవుల మీదుగా కొనసాగి, యేద్శి రామలింగు అభయారణ్యంలో ముగిసింది.
ఫారెస్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పులి మహారాష్ట్ర యవత్మాల్ జిల్లా తిప్పేశ్వరం పులుల అభయారణ్యం నుంచి బయలుదేరి, ఆదిలాబాద్ మీదుగా యేద్శి రామలింగు అభయారణ్యంలోకి చేరుకుంది. ఈ పులి వయస్సు మూడు సంవత్సరాలు అని గుర్తించారు. ట్రాకింగ్ కెమెరాల ద్వారా దీని ప్రయాణాన్ని అటవీ శాఖ నిర్ధారించింది.
పులి రాకతో యేద్శి రామలింగు అభయారణ్యంలో పర్యావరణం మరింత ప్రోత్సాహం పొందుతుందని అటవీ అధికారులు పేర్కొన్నారు. అక్కడున్న శివాలయం పేరు ఆధారంగా ఈ పులికి “రామలింగు పులి” అని పేరు పెట్టారు.
ఈ అరుదైన ప్రయాణం వన్యప్రాణుల సంరక్షణలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. 450 కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన పూర్తి చేసిన ఈ పులి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

COMMENTS