విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు షర్మిల మద్దతు – ఆమరణ దీక్ష హెచ్చరిక విశాఖపట్నం, మే 19 (ఆంధ్రప్రదేశ్ వార్తలు): విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు రేపట
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు షర్మిల మద్దతు – ఆమరణ దీక్ష హెచ్చరిక
విశాఖపట్నం, మే 19 (ఆంధ్రప్రదేశ్ వార్తలు):
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు రేపటి నుంచి సమ్మెకు దిగతామని ప్రకటించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వారికి మద్దతు ప్రకటించారు. ప్లాంట్ యాజమాన్యం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు.
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని, SAILలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే, రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ గేటు వద్ద ఆమరణ దీక్షకు దిగతానని హెచ్చరించారు.
కార్మికుల హక్కులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా మారాయని ఆరోపించారు.

Websoft Digital Media-SEO

COMMENTS