వెల్లివిరిసిన మత సామరస్యం – గణేష్ లడ్డూ వేలంలో ముస్లిం మహిళ గెలుపు

వెల్లివిరిసిన మత సామరస్యం – గణేష్ లడ్డూ వేలంలో ముస్లిం మహిళ గెలుపు

Homeతెలంగాణ

వెల్లివిరిసిన మత సామరస్యం – గణేష్ లడ్డూ వేలంలో ముస్లిం మహిళ గెలుపు

వెల్లివిరిసిన మత సామరస్యం.. గణేశ్ లడ్డూని వేలం పాటలో దక్కించుకున్న ముస్లిం మహిళ తెలంగాణలో మత సామరస్యం మరోసారి చాటుకుంది. నిర్మల్ జిల్లాలో వినాయక నిమజ

రాజకీయాల్లోకి గాలికి రాలేదు: భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్‌కు షాక్
ములుగులో తవ్వకాల్లో నాగుపాములు.. బయటపడిన పురాతన శిలలు

వెల్లివిరిసిన మత సామరస్యం.. గణేశ్ లడ్డూని వేలం పాటలో దక్కించుకున్న ముస్లిం మహిళ

తెలంగాణలో మత సామరస్యం మరోసారి చాటుకుంది. నిర్మల్ జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన గణేష్ లడ్డూ వేలంలో ముస్లిం మహిళ అం‍రీన్ రూ. 1,88,888కి లడ్డూను గెలుచుకున్నారు. ఇది రాష్ట్రంలో ముస్లిం మహిళలు గణేష్ లడ్డూ వేలంలో దక్కించుకోవడం రెండోసారి కావడం విశేషం. గతేడాది కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భాట్‌పల్లిలో ముస్లిం జంట రూ. 13,126కి లడ్డూను గెలుచుకున్నారు.

ఇక ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా లడ్డూ వేలం పాటలు రికార్డు స్థాయిలో జరిగాయి. హైదరాబాద్ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో 10 కిలోల గణపతి లడ్డూ రూ. 2.32 కోట్లకు అమ్ముడై సంచలనం సృష్టించింది. బాలాపూర్ లడ్డూ 35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ సొంతం చేసుకున్నారు. రాయదుర్గం మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో లడ్డూ రూ. 51.07 లక్షలకు రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ కొనుగోలు చేశారు. కొత్తపేటలో వినూత్నంగా జరిగిన లడ్డూ వేలంలో 333 కిలోల లడ్డూను బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్ లక్కీ డ్రాలో కేవలం రూ. 99కే దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఈ లడ్డూ వేలాలు తెలంగాణ సంస్కృతి, భక్తి, మత సామరస్యం, ఐక్యతను ప్రతిబింబిస్తున్నాయి.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్‌సైట్ మరియు యూట్యూబ్ చానెల్‌ను ఫాలో అవ్వండి.

Visit: www.digitalprimenews.in

Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube