స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్: గ్రామీణ ప్రాంతాల్లో విప్లవం? - Digital Prime News

స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్: గ్రామీణ ప్రాంతాల్లో విప్లవం?

Homeజాతీయం

స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్: గ్రామీణ ప్రాంతాల్లో విప్లవం?

స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు త్వరలో భారత్‌లో – గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ వృద్ధి దిశగా ముందడుగు. న్యూఢిల్లీ: ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లిం

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: గాల్లోనే కట్‌ఆఫ్ అయిన ఫ్యూయల్ స్విచ్‌లు! ప్రాథమిక దర్యాప్తులో షాకింగ్ వివరాలు.
విద్యార్థుల కోసం మోదీకి రాహుల్ లేఖ….
ప్రతి ఒక్క ఉగ్రవాదిని మట్టుబెడతాం- మోదీ ప్రభుత్వంలో ఎవరూ తప్పించుకోలేరు: షా వార్నింగ్

స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు త్వరలో భారత్‌లో – గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ వృద్ధి దిశగా ముందడుగు.
న్యూఢిల్లీ: ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీ మరికొన్ని నెలల్లో భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. నెలకు రూ.3,000 చొప్పున అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ లభించనున్నట్టు ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ఒక్కసారి హార్డ్‌వేర్ కిట్ కోసం రూ.33,000 ఖర్చవుతుందని పేర్కొంది.
టెలికం శాఖ నుంచి లైసెన్స్ పొందిన తర్వాత స్టార్‌లింక్‌కు భారత బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు మార్గం ఏర్పడింది. భారతీ ఎయిర్‌టెల్ (వన్‌వెబ్), రిలయన్స్ జియో శాటిలైట్ బ్రాంచ్ వంటి సంస్థలతో కలిసి శాటిలైట్ ఇంటర్నెట్ పోటీ పెరిగే అవకాశం ఉంది. లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లు ద్వారా 25–220 Mbps స్పీడ్‌ను అందించనున్నట్లు సమాచారం.
స్టార్‌లింక్ మొదట గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలను టార్గెట్ చేయనుంది. అక్కడ ఫైబర్ లేదా మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సేవలు పెద్దగా ఉపయుక్తం కానున్నాయి. భారతదేశంలో డేటా చౌకగానే ఉన్నా, ఈ సేవలు ఎక్కువ ధరకు లభించే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ధరల వివరాలు:
నెలవారీ ప్లాన్ ధర: ₹3,000 (అంచనా)
ఆఫర్ ధర: ₹800–₹1,000
హార్డ్‌వేర్ కిట్: ₹33,000 (ఒక్కసారి)
మొత్తం మొదటి ఏడాది ఖర్చు: ₹1.58 లక్షలు లేదా బంగ్లాదేశ్ ప్లాన్ల ప్రకారం ₹66,000
రెసిడెన్షియల్ లైట్ ప్లాన్: ₹2,600–₹3,000
స్టాండర్డ్ ప్లాన్: ₹4,000–₹6,000
ఇంకా IN-SPACe మరియు స్పెక్ట్రం కేటాయింపు అంశాలు కేంద్ర ప్రభుత్వ అనుమతిని ఎదురుచూస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ విప్లవం సాకారం కానుంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube