ఎయిర్ ఇండియా ప్రమాదం: గాల్లోనే కట్‌ఆఫ్ అయిన ఫ్యూయల్ స్విచ్‌లు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: గాల్లోనే కట్‌ఆఫ్ అయిన ఫ్యూయల్ స్విచ్‌లు! ప్రాథమిక దర్యాప్తులో షాకింగ్ వివరాలు.

Homeజాతీయం

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: గాల్లోనే కట్‌ఆఫ్ అయిన ఫ్యూయల్ స్విచ్‌లు! ప్రాథమిక దర్యాప్తులో షాకింగ్ వివరాలు.

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: గాల్లోనే కట్‌ఆఫ్ అయిన ఫ్యూయల్ స్విచ్‌లు! ప్రాథమిక దర్యాప్తులో షాకింగ్ వివరాలు ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదంపై ప్రాథమిక వ

ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన – ఐదు దేశాల్లో కీలక ఒప్పందాలు
సమంత–రాజ్ వివాహం: శ్యామలి దేవి పోస్ట్ వైరల్
బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: గాల్లోనే కట్‌ఆఫ్ అయిన ఫ్యూయల్ స్విచ్‌లు! ప్రాథమిక దర్యాప్తులో షాకింగ్ వివరాలు

ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదంపై ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే ఇంధన నియంత్రణకు సంబంధించిన రెండు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు అనూహ్యంగా ‘కట్‌ఆఫ్’ మోడ్‌లోకి వెళ్లడం వల్ల ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో విమానం తక్షణమే గాల్లోనే ఆగిపోయి, గతిశక్తి కోల్పోయింది.

సాధారణంగా ఈ స్విచ్‌లు ల్యాండింగ్ పూర్తైన తర్వాత మాత్రమే కట్‌ఆఫ్ చేయాలి. కానీ ఈ సంఘటనలో అవి గాల్లో ఉన్నప్పుడే ఆఫ్ కావడం అత్యంత ప్రమాదకరమైన ఘట్టంగా గుర్తించారు అధికారులు.

కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో, ఒక పైలట్ “ఎందుకు కట్‌ఆఫ్ చేశావ్?” అని ప్రశ్నించగా, మరో పైలట్ “నేను చేయలేదు” అని సమాధానం ఇచ్చినట్లు స్పష్టమైంది. ఈ ప్రమాద సమయంలో కెప్టెన్ పర్యవేక్షణలో కోపైలట్ విమానం నడుపుతుండగా, ఈ ఘోరం జరిగింది.

తర్వాతి దశలో, ఈ స్విచ్‌లు మళ్లీ ఇన్‌-ఫ్లైట్ (ఆన్) స్థితికి తీసుకురావడంతో ఇంజిన్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయినట్లు నివేదిక వెల్లడించింది. అయితే అప్పటికే విమానం ప్రమాదానికి లోనై 260 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంఘటనపై డీజీసీఏ మరియు ఇతర విమాన భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పైలట్ల మధ్య సమన్వయ లోపమా? లేక టెక్నికల్ ఫాల్ట్? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు

మరిన్ని రాజకీయ వార్తల కోసం చూడండి: Digital Prime News

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube