PM Modi Arrives at Bhogapuram to Inaugurate Alluri International Airport

భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీ.. అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం

Homeఆంధ్రప్రదేశ్

భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీ.. అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చ

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. రూ.195 కోట్ల అక్రమాలపై కీలక గుర్తింపులు!
జోసెఫ్ రావణ్‌కు మళ్లీ షాక్.. మరో కేసులో పోలీసుల విచారణ
ఏపీ రాజధాని ఎప్పటికీ అమరావతే.. జగన్‌కు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కౌంటర్

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం చేరుకున్నారు. ట్రయల్ రన్ అనంతరం ఈ విమానాశ్రయం రన్‌వేపై తొలిసారిగా ప్రధానమంత్రి ప్రత్యేక విమానం ల్యాండ్ కావడంతో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విమానాశ్రయంలో ప్రధానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని సందర్శించిన ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలు, చెక్-ఇన్ హాల్, సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించనున్నారు. అలాగే అరకు కాఫీ కియోస్క్‌ను సందర్శించి అరకు కాఫీని రుచి చూడనున్నారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను కూడా పరిశీలించనున్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

టెర్మినల్ నుంచి బహిరంగ సభా వేదిక వరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ఓపెన్‌టాప్ జీపులో ప్రధాని ప్రయాణించనున్నారు. మార్గమధ్యంలో వేలాది మంది గిరిజన మహిళలు ప్రదర్శించే సంప్రదాయ థింసా నృత్యాన్ని వీక్షించనున్నారు. ఈ కార్యక్రమం కోసం భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.

బహిరంగ సభలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్‌ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్-టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపనతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలు, రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, తాడిపత్రి నాలుగు లేన్ల బైపాస్ వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

‘నాన్న యూనిఫాం రక్తంతో తడిసింది’.. జంతర్ మంతర్ ఘటనపై పోలీసు కుటుంబాల ఆవేదన

హైడ్రాపై హైకోర్టు ఫైర్.. అధికారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్న జడ్జి

నేటితో ITR గడువు ముగింపు.. ఫైల్ చేయకపోతే రూ.5,000 జరిమానా!

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube