KTR Slams Revanth Govt Over Telangana Dignity Issue

తెలంగాణ గౌరవం దెబ్బతింది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

Homeతెలంగాణ

తెలంగాణ గౌరవం దెబ్బతింది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

భద్రాచలంలో మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆక్స్‌ఫర్డ్ ఆహ్వానం….
కొండా సురేఖ క్షమాపణలు.. నాగార్జున సంచలన నిర్ణయం.
గోపీనాథ్ ఆస్తులపై కేటీఆర్ కుట్ర: బండి సంజయ్.

భద్రాచలంలో మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన విషాద ఘటనను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక కుటుంబం తమ బంధువు మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి రావడం తెలంగాణ సమాజానికి అవమానకరమని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

సుభాష్‌నగర్‌కు చెందిన కండె వెంకన్న వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు మార్చురీ వాహనం ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు ఆస్పత్రి అధికారులను వేడుకున్నా స్పందన లేకపోయిందని సమాచారం. చివరకు ప్రైవేటు వాహనం ఏర్పాటు చేసుకునే స్థోమత లేక కుటుంబ సభ్యులే మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

ఈ ఘటనపై స్పందించిన కేటీఆర్, కేసీఆర్ హయాంలో పేదల అంతిమయాత్రలు కూడా గౌరవప్రదంగా జరగాలని ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రచారం, పర్యటనలు, సభలపైనే దృష్టి పెట్టి ప్రజల ప్రాథమిక అవసరాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజల డబ్బును ప్రచార కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రాజకీయ కక్షసాధింపులు, ప్రచార హడావుడి తప్ప ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజలను అవమానకర పరిస్థితుల్లోకి నెట్టేస్తోందని ఆరోపించారు. ఈ ఘటన కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషాదం మాత్రమే కాదని, రాష్ట్రంలో ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాల పరిస్థితికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలువేగంగా అందించే Digital Prime News‌ తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube