ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటినుంచి ప్రారంభం…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటినుంచి ప్రారంభం….

Homeజాబ్స్ & ఎడ్యుకేషన

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటినుంచి ప్రారంభం….

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం – 5 నిమిషాల ఆలస్యానికి అనుమతి హైదరాబాద్‌, మే 21 (నమస్తే తెలంగాణ): ఈ నెల 23వ తేదీ నుంచి ఇ

నేటి నుంచి తెలంగాణ EAPCET పరీక్షలు…..
పాలిసెట్‌ ఫలితాలు 2025 విడుదల…
తెలంగాణకు సైనిక్ స్కూల్ పరిస్థితి ఏమిటి?

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం – 5 నిమిషాల ఆలస్యానికి అనుమతి
హైదరాబాద్‌, మే 21 (నమస్తే తెలంగాణ): ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య తెలిపారు. విద్యార్థులకు 5 నిమిషాల ఆలస్యానికి అనుమతి ఇవ్వనున్నారు. మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల మాదిరిగానే ఈసారి కూడా ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించనున్నారు.
ఫస్ట్ ఇయర్ పరీక్షలు: ఉదయం 9:00 నుంచి 12:00 వరకు
సెకండ్ ఇయర్ పరీక్షలు: మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు
ఉదయం 9:05 తర్వాత, మధ్యాహ్నం 2:35 తర్వాత వచ్చిన విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదు. ఈ పరీక్షలు మే 29వ తేదీతో ముగియనున్నాయి. మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు ఈసారి పరీక్షలు రాయనుండగా, రాష్ట్రవ్యాప్తంగా 892 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్ బోర్డు తెలిపింది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube