కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. సీఎం రేవంత్ తీరుపై మంత్రుల భేటీ

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. సీఎం రేవంత్ తీరుపై మంత్రుల భేటీ

Homeతెలంగాణ

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. సీఎం రేవంత్ తీరుపై మంత్రుల భేటీ

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై నలుగురు మంత్రుల రహస్య భేటీ రాజకీయ దుమారం రేపుతోంది. Senior Congress min

కొండా సురేఖపై ఒత్తిడి.. రాజీనామా చేయించే దిశగా కాంగ్రెస్‌లో మంతనాలు?
రాజకీయాల్లోకి గాలికి రాలేదు: భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
రెండు డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం.. టీఎన్జీవోల హర్షం

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై నలుగురు మంత్రుల రహస్య భేటీ రాజకీయ దుమారం రేపుతోంది.

Senior Congress ministers meet: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నైని సింగరేణి బొగ్గు స్కామ్‌తో మొదలైన అసంతృప్తి ఇప్పుడు పెద్ద రాజకీయ దావానలంలా మారుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై పార్టీ లోపలే తీవ్ర అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో, ఆయన విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో నలుగురు కీలక మంత్రులు ఒకచోట సమావేశం కావడం సంచలనంగా మారింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. సుమారు రెండున్నర గంటలకు పైగా నలుగురు మంత్రులు మాత్రమే సమావేశమయ్యారు. ఇది ప్రభుత్వ పరమైన సబ్ కమిటీ సమావేశం కాదని, కేవలం నికార్సయిన కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన తెలంగాణ సీనియర్ నేతల భేటీగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

భేటీ మధ్యలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా జాయిన్ కావడం చర్చనీయాంశమైంది. సింగరేణి బొగ్గు స్కామ్, ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ కథనాలు, వాటి వెనుక ఉన్న శక్తులపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనే భావన ఈ చర్చల్లో వ్యక్తమైందని సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన సీనియర్ నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీయేలా లీకులు ఇవ్వడం, కుట్రపూరిత వాతావరణం సృష్టించడం పట్ల మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇలాగే కొనసాగితే పార్టీగతంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని చర్చించినట్టు తెలిసింది.

ఈ భేటీపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఇది పరిపాలన అంశాలపై సమావేశమై ఉండొచ్చని మాత్రమే వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఢిల్లీలో ఆరా తీసినట్టు తెలుస్తోంది. బొగ్గు స్కామ్, టెండర్ల విధాన మార్పులపై హైకమాండ్‌కు మెయిల్ వెళ్లినట్టు, దానిపై స్పందనకు సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube