పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్డీఏ కీలక సమావేశంలో వ్యూహంపై చర్చ జరిగింది
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్డీఏ కీలక సమావేశంలో వ్యూహంపై చర్చ జరిగింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్‌తో పాటు డీలిమిటేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లో తీసుకురావాలని కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో దేశ రాజకీయాల్లో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో ఎన్డీఏ కీలక మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అన్నపూర్ణాదేవి, రామ్మోహన్ నాయుడు, లల్లన్ సింగ్, జయంత్ చౌదరి తదితరులు పాల్గొని పార్లమెంట్ వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది.
గత సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి బిల్లుకు అవసరమైన మద్దతు లభించే అవకాశాలపై కేంద్ర నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అదే సమయంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులపై నేరారోపణలకు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును మాత్రం ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించడాన్ని తప్పనిసరి చేసే బిల్లును ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి రాజకీయ పరిణామాలు, ప్రతిపక్ష పార్టీల బలహీనత, ఇండియా కూటమిలో చోటుచేసుకున్న మార్పులు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించాయని ఎన్డీఏ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
రూ.2 వేలపైగా UPI చెల్లింపులకు ఛార్జీలు? కేంద్రం కొత్త ప్రతిపాదన!
ధరణిపై సిట్ ఏర్పాటు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడి
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS