కొత్త కరోనా వేరియంట్ ఎంత ప్రమాదకరం? - Digital Prime News - Latest Telugu News Digital Prime News

కొత్త కరోనా వేరియంట్ ఎంత ప్రమాదకరం?

Homeలైఫ్ స్టైల్

కొత్త కరోనా వేరియంట్ ఎంత ప్రమాదకరం?

కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా, వైరస్ సోకితే జలుబుతో పాటు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.... దేశంలో మళ్లీ కరోనా గుబులు... కొత్త వేరియంట్. పై ఆందోళన ద

బంగారం-వెండి ధరలు పెరుగుదల
Fruits for Digestion | జీర్ణ ఆరోగ్యానికి 10 అద్భుత పండ్లు.
పూర్తి ఆరోగ్యానికి 6-6-6 వాకింగ్ రూల్..

కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా, వైరస్ సోకితే జలుబుతో పాటు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి….
దేశంలో మళ్లీ కరోనా గుబులు… కొత్త వేరియంట్. పై ఆందోళన
దేశంలో మరోసారి కరోనా భయాన్ని రాజేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ .కేసులు కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు గానీ, ఈ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.
వేరియంట్ అంటే ఏంటి?
వేరియంట్‌ అనేది 2023లో కనిపించిన ఒమిక్రాన్ వేరియంట్‌లోనే రూపాంతరం పొందిన కొత్త రూపం. ఇది ముందున్న వేరియంట్స్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ వేరియంట్‌లో 30కి పైగా మ్యుటేషన్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల ఇది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుని త్వరగా విస్తరిస్తోంది.
ఇతర దేశాల్లో లాంటి పరిస్థితి…
యునైటెడ్ స్టేట్స్, సింగపూర్, చైనా వంటి దేశాల్లో ఇప్పటికే . కేసులు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఇదే తరహాలో ఆసియా దేశాల్లో కూడా వేగంగా వ్యాపిస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ భయం తలెత్తుతోంది.
లక్షణాలు ఏముంటాయి?
వేరియంట్‌ సోకిన వారి నుంచి వైద్యులు గుర్తించిన ముఖ్యమైన లక్షణాలు ఇవే:
పొడి దగ్గు.
గొంతు నొప్పి.
జలుబు.
ముక్కు మూసుకుపోవడం.
ఊపిరితిత్తులపై ప్రభావం.
తలనొప్పి.
జ్వరం.
నోట్లో కురుపులు.
విపరీతమైన అలసట.
కళ్లు తిరగడం.
డయేరియా.
రుచి, వాసన కోల్పోవడం.
ఈ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
భారత్‌లో తాజా పరిస్థితి.
2025 మే 19 నాటికి దేశంలో 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో JN.1 వేరియంట్ కేసుల సంఖ్యను మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. ఇప్పటికీ కేసుల పెరుగుదలపై కేంద్రం అప్రమత్తంగా ఉందని, అవసరమైనచోట మానిటరింగ్ పెంచిందని అధికారులు తెలిపారు.
జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం.
ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నా, ఆహారపు అలవాట్లు, శుభ్రతపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా:
లక్షణాలు ఉన్నపుడు వెంటనే టెస్ట్ చేయించుకోవాలి.
భౌతిక దూరం పాటించాలి.
హైజీన్ మెయింటేన్ చేయాలి.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలి.
చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి.

websoft -Infra Marketing instagram image

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube