అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన డబుల్ గేమ్‌తో హాట్‌టాపిక్ అయ్యారు. మిత్రుడినంటూ నమ్మకాన్ని పెంచి.. చివరికి ముంచేశాడనే విమర్శలు వ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన డబుల్ గేమ్‌తో హాట్‌టాపిక్ అయ్యారు. మిత్రుడినంటూ నమ్మకాన్ని పెంచి.. చివరికి ముంచేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి విషయమై అమెరికా వైఖరి ప్రశ్నార్థకంగా మారింది.
టెల్‌అవీవ్ దాడికి ముందే అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ.. దాన్ని ఖతార్‌కు ఆలస్యంగా చేరవేయడమే వివాదానికి కారణమైంది. దాడి మొదలై పది నిమిషాల తర్వాత మాత్రమే అమెరికా అధికారులు సమాచారం అందించారని ఖతార్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ దాడిలో హమాస్ నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు.
ట్రంప్ తన శైలిలోనే ప్రపంచానికి వీరతాడు కట్టుకుంటూ.. “నానేన్నో యుద్ధాలు ఆపాను” అంటూ మళ్లీ మళ్లీ వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి మిత్రదేశాలపైనా ఆయన వైఖరి అనుమానాలకు తావిస్తోంది. భారత్‌పై భారీ సుంకాల విధానం, ఇప్పుడు ఖతార్‌తో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారాయి. ఖతార్‌తో అమెరికా సంబంధాలు ఇటీవల బలపడినా.. ఇలాంటి పరిణామం ఆ దేశంలో అసంతృప్తిని పెంచింది.

COMMENTS