చెన్నైలో శ్రీకాళహస్తికి చెందిన యువకుడి హత్య: జనసేన నేతలపై కేసు, పార్టీ నుంచి బహిష్కరణ

చెన్నైలో శ్రీకాళహస్తికి చెందిన యువకుడి హత్య: జనసేన నేతలపై కేసు, పార్టీ నుంచి బహిష్కరణ.

Homeఆంధ్రప్రదేశ్

చెన్నైలో శ్రీకాళహస్తికి చెందిన యువకుడి హత్య: జనసేన నేతలపై కేసు, పార్టీ నుంచి బహిష్కరణ.

చెన్నైలో శ్రీకాళహస్తికి చెందిన యువకుడి హత్య: జనసేన నేతలపై కేసు, పార్టీ నుంచి బహిష్కరణ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బక్కిసంపాలెం గ్రామానికి చెంది

విశాఖ: నేడు జీవీఎంసీ ప్రత్యేక సమావేశం….
సింహాచల గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో ప్రారంభం
అలిపిరి వద్ద భక్తులకు బిగ్ రిలీఫ్.. టీటీడీ కొత్త సదుపాయాలు సిద్ధం

చెన్నైలో శ్రీకాళహస్తికి చెందిన యువకుడి హత్య: జనసేన నేతలపై కేసు, పార్టీ నుంచి బహిష్కరణ

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బక్కిసంపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే యువకుడి హత్య కేసు చెన్నైలో కలకలం రేపుతోంది. చెన్నై మింట్ పరిధిలోని కూవంనదిలో లభించిన మృతదేహం శవపరిశీలన అనంతరం రాయుడిగా గుర్తించారు.

రాయుడు గతంలో శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ కోటా వినూత దంపతుల వద్ద డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తి. అతని ప్రవర్తన కారణంగా జూన్ 21న విధుల నుంచి తొలగించగా, అప్పటి నుంచి అతను అదృశ్యమయ్యాడు.

ఈనెల 8న చెన్నై ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుక భాగంలో మృతదేహాన్ని పడేసిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వినూత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శివకుమార్, గోపి, దాసర్‌లు కూడా ఉన్నారు. వీరిని చెన్నైలోని సెవెల్ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

ఈ కేసు ఆధారంగా జనసేన పార్టీ కోటా వినూతను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పార్టీ విధివిధానాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు పేర్కొంటూ, ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు వ్యాఖ్యానించిన అధిష్టానం ఈ చర్య తీసుకుంది.

ఇప్పటివరకు 5 మంది అరెస్టు కాగా, హత్యకు గల అసలు కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Srikalahasti Youth Murder Jana Sena Leaders Held

Srikalahasti Youth Murder Jana Sena Leaders Held

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube