రామ్ చరణ్ ‘పెద్ది’: శివరాజ్‌కుమార్ ఫస్ట్ లుక్ రివీల్.

రామ్ చరణ్ ‘పెద్ది’: శివరాజ్‌కుమార్ ఫస్ట్ లుక్ రివీల్.

Homeసినిమా

రామ్ చరణ్ ‘పెద్ది’: శివరాజ్‌కుమార్ ఫస్ట్ లుక్ రివీల్.

రామ్ చరణ్ ‘పెద్ది’: శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్! రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "పెద్ద

శ్రీలీల ‘సీతా’ యాప్ ఈవెంట్ హైలైట్….
వార్ 2 రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ
నితిన్ ‘తమ్ముడు’ ట్రైల‌ర్ రిలీజ్.. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ యాక్షన్ డ్రామా!

రామ్ చరణ్ ‘పెద్ది’: శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్!

రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది” పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో రామ్ చరణ్ తనదైన స్టైల్‌తో అభిమానులను అలరించాడు. బ్యాట్ ఝుళిపిస్తూ, మాస్ అటిట్యూడ్ చూపిస్తూ రామ్ చరణ్ ‘పెద్ది’ లుక్‌ను పాన్ ఇండియా లెవెల్‌లో నిలబెట్టాడు.

తాజాగా, ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర పోస్టర్ విడుదలైంది. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ పుట్టిన రోజు సందర్భంగా, మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో శివన్నా “గౌర్నాయుడు” అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ పోస్టర్‌ను చూసినవారికి, ఆయన పాత్ర సినిమా కథలో ఎంత కీలకమైనదో స్పష్టమవుతుంది.

శివరాజ్‌కుమార్ స్పందిస్తూ,
“ఈ సినిమా కోసం నేను తొలిసారిగా తెలుగు డైలాగ్ మాట్లాడాను. డైరెక్టర్ బుచ్చిబాబు సానా చాలా మంచి వ్యక్తి. నా నటనను అభినందించారు. రామ్ చరణ్ చాలా వినయంగా, సరదాగా మెలిగాడు. ‘పెద్ది’ సినిమాలో నా పాత్ర నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. కథ కూడా చాలా బాగా నచ్చింది” అని తెలిపారు.

సినిమా వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, శివరాజ్‌కుమార్ ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్‌కు కోచ్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి మధ్య సీన్లు ఈ సినిమాకు హైలైట్ కానున్నాయని చెబుతున్నారు.

పెద్ది చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండగా, రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్ హిట్ అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి. శివరాజ్‌కుమార్ లాంటి స్టార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడం సినిమాపై మరింత హైప్ పెంచింది.

మరిన్ని రాజకీయ వార్తల కోసం చూడండి: Digital Prime News

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube