మావోయిస్టులను చంపి మృతదేహాల ముందు సంబరాలు చేసిన DRG బలగాలు రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌ
మావోయిస్టులను చంపి మృతదేహాల ముందు సంబరాలు చేసిన DRG బలగాలు
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సుప్రీం లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎదురుకాల్పులు అనంతరం డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ (DRG) బలగాలు మృత మావోయిస్టుల దేహాల ముందు సంబరాలు చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.
ఈ ఘటనలోని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మావోయిస్టు నాయకుడిగా ఉన్న బసవరాజు గత రెండు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌ను సుదీర్ఘ గడ్డును పూర్తిగా శుభ్రం చేయడానికి కీలక ఘట్టంగా అధికారులు పేర్కొన్నారు.
ఘటన అనంతరం DRG బలగాలు విజయోత్సవాలు చేసుకున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మానవ హక్కుల సంఘాలు, కొంతమంది న్యాయవాదులు ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదొక మిలిటరీ విజయమా, లేక మానవతా విలువలకు వ్యతిరేకమా అనే చర్చలు మొదలయ్యాయి.

COMMENTS