భారత్‌పై మరోసారి దాడికి తెగబడ్డ పాక్‌…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

భారత్‌పై మరోసారి దాడికి తెగబడ్డ పాక్‌….

Homeఅంతర్జాతీయం

భారత్‌పై మరోసారి దాడికి తెగబడ్డ పాక్‌….

పాక్ దాడికి భారత్ ప్రతీకారం: క్షిపణులను గగనతలంలోనే కూల్చివేసిన భారత బలగాలు భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ దాడ

భారత సైన్యంలో ఉద్యోగాల పేరిట సోషల్ మీడియాలో సైబర్ మోసాలు…
జవాన్ మురళీ తండ్రిని కలిసిన పవన్ కళ్యాణ్: కన్నీటి సన్నివేశం..
కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న కూంబింగ్…

పాక్ దాడికి భారత్ ప్రతీకారం: క్షిపణులను గగనతలంలోనే కూల్చివేసిన భారత బలగాలు
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ దాడులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. లాహోర్ నుంచి ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో పాకిస్థాన్ చేపట్టిన దాడులను భారత బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా, పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణులను మన బలగాలు గగనతలంలోనే పేల్చివేశాయి. జమ్ము, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ దాడులకు పాల్పడింది. భారత్‌లోని 15 సైనిక పోస్టులపై పాక్ దాడి చేసింది. పంజాబ్ లోని వ్యవసాయ భూముల్లో పాక్ బాంబుల శకలాలు లభించడం పాక్ దాడుల తీవ్రతను వెల్లడిస్తోంది. భారత సైనిక స్థావరాలపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవని పాకిస్థాన్‌ను భారత్ హెచ్చరించింది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube