విక్టరీ పరేడ్‌లో ప్రమాదం – ఫ్యాన్స్‌పైకి దూసుకెళ్లిన కారు. లండన్: ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్ నగరంలో ప్రీమియర్ లీగ్ సాకర్ టైటిల్‌ను గెలుచుకున్న లివర్
విక్టరీ పరేడ్‌లో ప్రమాదం – ఫ్యాన్స్‌పైకి దూసుకెళ్లిన కారు.
లండన్:
ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్ నగరంలో ప్రీమియర్ లీగ్ సాకర్ టైటిల్‌ను గెలుచుకున్న లివర్‌పూల్ ఫుట్‌బాల్ టీమ్ విజయం సందర్భంగా నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో తీవ్ర ఘటన చోటు చేసుకుంది.
వేలాది మంది అభిమానులు సెలబ్రేషన్స్ కోసం వీధుల్లోకి తరలివచ్చిన సమయంలో ఓ కారు అకస్మాత్తుగా ఫ్యాన్స్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో అభిమానులు గాయపడ్డారు. ఘటన అనంతరం పోలీసుల దర్యాప్తులో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
ఈ ప్రమాదంపై యూకే ప్రధాని కియర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తగిన వైద్యం అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
websoft Technologies – instagram post

COMMENTS