కేంద్ర హోం మంత్రిత్వశాఖ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసిన అనంతరం తొలిసారి పబ్లిక్‌లో కనిపించిన కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్
కేంద్ర హోం మంత్రిత్వశాఖ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసిన అనంతరం తొలిసారి పబ్లిక్‌లో కనిపించిన కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని మళ్లీ ఓ వివాహ వేడుకలో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ముంబైలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్న నాని అప్పటి నుంచి ప్రజల్లో కనిపించలేదు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై వార్తల్లో నిలిచారు.
ఈ నేపథ్యంలో కొడాలి నానిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశం విడిచి వెళ్ళే అవకాశం ఉందని భావించి, అన్ని ఎయిర్‌పోర్టులు, సరిహద్దుల్లో నిఘా పెట్టాలని ఆ నోటీసుల్లో సూచించారు. నానిపై పలు క్రిమినల్ కేసులు ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉన్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
తనపై ఉన్న కేసులు, కేంద్రం జారీ చేసిన నోటీసులపై ఇప్పటివరకు కొడాలి నాని ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం గమనార్హం.
Nakashatra Agency – youtube video

COMMENTS