డైరెక్టర్ బాబీకి మెగాస్టార్ చిరంజీవి నుంచి లగ్జరీ వాచ్ గిఫ్ట్.. ధర ఎన్ని లక్షలంటే! హైదరాబాద్: భోళా శంకర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరం
డైరెక్టర్ బాబీకి మెగాస్టార్ చిరంజీవి నుంచి లగ్జరీ వాచ్ గిఫ్ట్.. ధర ఎన్ని లక్షలంటే!
హైదరాబాద్: భోళా శంకర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారారు. కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర లో నటిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.
అలానే బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న చిరంజీవి. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక వీటి తర్వాత డైరెక్టర్ బాబీతో మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, డైరెక్టర్ బాబీకి మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. సుమారు రూ.6 నుంచి 10 లక్షల మధ్య విలువ చేసే ఒమేగా సీమాస్టర్ లగ్జరీ వాచ్‌ను బాబీకి చిరు బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
“చిరంజీవి గారి నుంచి నాకు మెగా సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ బహుమతికి నేను అస్సలు వెలకట్టలేను. థ్యాంక్యూ అన్నయ్యా! ఈ స్పెషల్ గిఫ్ట్‌ను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అంటూ చిరు మీద తన అభిమానాన్ని వ్యక్తపరిచారు బాబీ. వాచ్ ధరించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫ్యాన్స్ మాత్రం “చిరంజీవి గారికి ఎవరు నచ్చారంటే జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు”, “వాచ్ అదిరింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి తన శైలిలో మరోసారి మనసు దోచుకున్నారు.

websoft Digital Media -Graphic Designer Service

COMMENTS