Hyderabad Metro Takeover: HMRL Eyes Alternative Loans as IRFC Delay Continues

మెట్రో టేకోవర్‌కు కొత్త ప్లాన్.. ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలపై బ్రేక్, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ కీలక నిర్ణయం!

Homeతెలంగాణ

మెట్రో టేకోవర్‌కు కొత్త ప్లాన్.. ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలపై బ్రేక్, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ కీలక నిర్ణయం!

హైదరాబాద్ మెట్రో తొలి దశ టేకోవర్ కోసం ఐఆర్‌ఎఫ్‌సీ రుణాల్లో జాప్యం రావడంతో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ప్రత్యామ్నాయ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ రుణాలపై దృష్టి సారి

మెట్రో రుణం ఆపేసిన కిషన్ రెడ్డి? సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్ మెట్రో భారమైపోయింది.. కేంద్రానికి లేఖ రాసిన ఎల్‌అండ్‌టీ
హైదరాబాద్ మెట్రోలో భారీ మార్పులు.. 10 స్టేషన్ల అప్‌గ్రేడ్‌తో ప్రయాణికులకు గుడ్‌న్యూస్!

హైదరాబాద్ మెట్రో తొలి దశ టేకోవర్ కోసం ఐఆర్‌ఎఫ్‌సీ రుణాల్లో జాప్యం రావడంతో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ప్రత్యామ్నాయ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ రుణాలపై దృష్టి సారించింది.

హైదరాబాద్ మెట్రో తొలి దశ టేకోవర్ ప్రక్రియ మరోసారి కీలక మలుపు తిరిగింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రుణాల మంజూరులో జాప్యం కొనసాగుతుండటంతో హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (HMRL) అధికారులు ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులపై దృష్టి సారించారు. 3.5 నుంచి 4 శాతం వడ్డీ రేటుతో నిధులు సమకూర్చేందుకు హడ్కోతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతో చర్చలు జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై వచ్చే రెండు వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్ మెట్రో తొలి దశను నిర్మించిన ఎల్‌అండ్‌టీ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు సుమారు రూ.15 వేల కోట్ల ఆర్థిక ప్రణాళిక రూపొందించింది. ఇందులో రూ.13,600 కోట్లను ఐఆర్‌ఎఫ్‌సీ రుణంగా, మిగిలిన రూ.1,400 కోట్లను హెచ్‌ఎండీఏ ద్వారా సమకూర్చాలని ప్రభుత్వం భావించింది. అయితే రుణ ప్రక్రియలో ఆలస్యం చోటుచేసుకోవడంతో టేకోవర్‌తో పాటు రెండో దశ విస్తరణ పనులపై కూడా ప్రభావం పడే పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీతో రుణాలు అందించే ఇతర సంస్థలను సంప్రదించాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ నిర్ణయించింది. అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థలను నియమించి రుణాల సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి మెట్రో టేకోవర్‌కు ఆర్థిక అడ్డంకులను తొలగించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.

ఇదే సమయంలో మెట్రో రెండో దశలోని ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట కారిడార్‌కు సంబంధించిన జనరల్ కన్సల్టెన్సీ టెండర్ ప్రక్రియను కూడా హెచ్‌ఎంఆర్‌ఎల్ రద్దు చేసింది. గత టెండర్‌కు ఒకే ఒక సంస్థ బిడ్ దాఖలు చేయడంతో మళ్లీ కొత్త టెండర్లను ఆహ్వానించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై ప్రభుత్వం మరింత వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

55.90 అడుగులకు గోదావరి.. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక, మంత్రి తుమ్మల అలర్ట్

భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీ.. అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం

‘నాన్న యూనిఫాం రక్తంతో తడిసింది’.. జంతర్ మంతర్ ఘటనపై పోలీసు కుటుంబాల ఆవేదన

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube