హీరో విశాల్, సాయి ధన్సిక పెళ్లి తేదీ ఖరారు..! తమిళ హీరో విశాల్, నటి సాయి ధన్సిక త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ‘యోగి
హీరో విశాల్, సాయి ధన్సిక పెళ్లి తేదీ ఖరారు..!
తమిళ హీరో విశాల్, నటి సాయి ధన్సిక త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ‘యోగి దా’ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్ సందర్భంగా వీరిద్దరూ ఈ విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు.
2006లో ‘మనతోడు మజైకలం’ సినిమాతో రంగ ప్రవేశం చేసిన సాయి ధన్సిక, తొలిదశలో మరియా పేరుతో సినిమాలు చేసింది. అనంతరం కన్నడ సినిమా ‘కెంప’తో సాయి ధన్సికగా పేరు మార్చుకుంది. బాల దర్శకత్వం వహించిన ‘పరదేశీ’ చిత్రం, తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి నటించిన ‘కబాలి’ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. తెలుగులో ‘షికారు’, ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ వంటి చిత్రాల్లో నటించింది.
తమిళనాడులో జన్మించిన ధన్సిక ప్రస్తుతం 35 ఏళ్ల వయస్సు కలిగి ఉంది. తాజాగా ఆమె నటించిన ‘యోగి దా’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో ధన్సిక, విశాల్ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా ధన్సిక మాట్లాడుతూ – “బేబీ.. నేను ఈ విషయం బయటపెట్టేయనా!” అంటూ విశాల్‌ను అడిగింది. అనంతరం – “ఈ విషయం రహస్యంగా ఉంచాలనుకున్నాం. కానీ మధ్యాహ్నం నుంచి వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. అందుకే అధికారికంగా చెప్పాలనిపించింది. నేను, విశాల్ ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నాం. మేం ప్రేమలో మునిగిపోయాం. విశాల్‌ని సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నా. ఐ లవ్ యూ” అంటూ ధన్సిక చెప్పింది.
హీరో విశాల్ కూడా స్పందిస్తూ – “సాయి ధన్సిక అద్భుతమైన వ్యక్తి. ఆమెకి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. మేమిద్దరం త్వరలో ఆనందమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ఆమె నటన కొనసాగిస్తుంది” అని వెల్లడించారు.
websoft technologies- instagram link

COMMENTS