స్పిరిట్ సినిమా నుంచి దీపికా ఔట్ – సందీప్ రెడ్డి సంచలన ట్వీట్. ముంబయి: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబ
స్పిరిట్ సినిమా నుంచి దీపికా ఔట్ – సందీప్ రెడ్డి సంచలన ట్వీట్.
ముంబయి:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోయే భారీ చిత్రం ‘స్పిరిట్’ ఈ మధ్య కాలంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో కథానాయికగా ఎంపికైన దీపికా పడుకోన్‌ను సినిమా నుంచి తొలగించారని సమాచారం.
దీపికా స్థానంలో తాజాగా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రిను కథానాయికగా ఖరారు చేశారు. దీనిపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా దీపికా – సందీప్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ తీవ్రంగా ముదిరిందని టాక్.
డిమాండ్లే కారణమా?
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, దీపికా పడుకోన్ కొన్ని తీవ్ర డిమాండ్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
తాను రోజుకు కేవలం 6 గంటలు మాత్రమే పని చేస్తానని,
పారితోషికంగా రూ. 30 కోట్లు ఇవ్వాలని,
అదనంగా జీఎస్టీ,
తన టీమ్‌లో ఉన్న 20 మంది సిబ్బందికి జీతాలు, హోటల్, ట్రావెల్ మొదలైన అన్ని ఖర్చులు నిర్మాతలే భరించాలన్నట్లు**,
ఈ డిమాండ్లు దర్శకుడు సందీప్ రెడ్డికి అసహనానికి గురిచేశాయని సమాచారం. దీంతో ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
సందీప్ రెడ్డి ట్వీట్ వైరల్
ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీపికాని పరోక్షంగా ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది:
“అధికారికంగా ఒప్పందం లేకున్నా కథ ఎవరికీ చెప్పొద్దనే నియమం ఉంది. నిన్ను నమ్మి కథ చెప్పాను. కానీ నువ్వు కథను బయట పెట్టి నీ స్వభావాన్ని వెల్లడించావు. అయినా భయపడేది లేదు. నాకేమీ ఫరక్ పడదు.”
ఈ ట్వీట్‌లో వ్యక్తమైన భావోద్వేగం పరిశీలిస్తే, ఆయన వ్యక్తిగతంగా బాధపడినట్టుగా కనిపిస్తోంది. బాలీవుడ్ వర్గాల కథనాల ప్రకారం, ఓ వెబ్‌సైట్‌లో ‘స్పిరిట్’ కథ రివీల్ కావడం, దీపికా వల్లనే జరిగిందని సందీప్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. కథలో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇది ‘A’ రేటెడ్ మూవీ అని సదరు సైట్‌లో పేర్కొన్నారు.
ఇక స్పిరిట్ హీరోయిన్ త్రిప్తిదిమ్రి.
సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో ఇప్పుడు త్రిప్తి దిమ్రి కథానాయికగా నటించనున్నారు. ‘బుల్లెట్’, ‘అనార్కలి ఆఫ్ ఆరా’, ‘లైలా మజ్నూ’, ‘యానిమల్’ చిత్రాలతో త్రిప్తి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ ఘటనపై వివిధ కోణాల విశ్లేషణ.
దీపికా పెద్ద స్టార్ కావడం,
ఆమె డిమాండ్లు సాధారణ నిర్మాతల సామర్థ్యానికి మించినవవు కావడం,
కథ లీక్ కావడంపై దర్శకుడి అసహనం,
వీటన్నింటి కలయికగా ఈ వివాదం ఏర్పడినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Arukaleoverseas consultancy – instagram post

COMMENTS