న్యూఢిల్లీ, మే 19: భారతీయ రైల్వే సేవలను అన్ని విధాలా సమగ్రంగా అందించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ‘స్వరైల్ (SwaRail
న్యూఢిల్లీ, మే 19: భారతీయ రైల్వే సేవలను అన్ని విధాలా సమగ్రంగా అందించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ‘స్వరైల్ (SwaRail)’ పేరుతో ఓ నూతన మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేసిన ఈ యాప్‌ను ‘సూపర్ యాప్’గా పేర్కొంటున్నారు.
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ‘రైల్ కనెక్ట్’ యాప్‌తో పోల్చితే ‘స్వరైల్’లో మరింత అధునాతన సౌకర్యాలు ఉన్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. ప్రయాణికులు ఈ యాప్ ద్వారా రిజర్వ్‌డ్, అన్ రిజర్వ్‌డ్ టికెట్లు, ప్లాట్‌ఫామ్ టికెట్లు పొందడమే కాకుండా, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్, తదితర సేవలను కూడా పొందవచ్చు.
ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్వరైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాత IRCTC ‘రైల్ కనెక్ట్’ యాప్ యూజర్లు తమ అదే అకౌంట్‌తో లాగిన్ అవొచ్చు. కొత్త యూజర్లు కొత్త ఖాతా సృష్టించాల్సి ఉంటుంది.
ఈ యాప్‌తో రైలు ప్రయాణం మరింత సులభతరంగా, స్మార్ట్‌గా మారనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

websoft technologies-

COMMENTS