NIMS Doctor Case: ACB Searches Five Homes, Seizes ₹7 Lakh Cash

నిమ్స్ డాక్టర్ కేసులో ఏసీబీ సోదాలు.. బార్బర్ ఇంట్లో రూ.7 లక్షలు స్వాధీనం

Homeతెలంగాణ

నిమ్స్ డాక్టర్ కేసులో ఏసీబీ సోదాలు.. బార్బర్ ఇంట్లో రూ.7 లక్షలు స్వాధీనం

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐదుగురి ఇళ్లలో తనిఖీలు చేసి బార్బర్ ధన్‌రాజ్ ఇంట్లో రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్న

హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌పై ఏసీబీ దాడులు.. 12 చోట్ల సోదాలు, కీలక పత్రాలు స్వాధీనం.
ఏసీ శాంతికి మధ్యంతర బెయిల్.. ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం
హెచ్‌ఎండీఏలో ఏసీబీ కలకలం.. చీఫ్ ఇంజనీర్ సస్పెన్షన్‌కు రంగం సిద్ధం!

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐదుగురి ఇళ్లలో తనిఖీలు చేసి బార్బర్ ధన్‌రాజ్ ఇంట్లో రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలో సంచలనం సృష్టించిన నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్టైన లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలు, మనీట్రయిల్‌పై అధికారులు దృష్టి సారించారు.

మంగళవారం తెల్లవారుజాము నుంచి నిమ్స్ ఉద్యోగులకు చెందిన ఐదుగురి ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిమ్స్ బార్బర్ ధన్‌రాజ్ ఇంట్లో రూ.7 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాల్లో లభించిన నగదు, భూములకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆర్థిక ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఐదు ప్రాంతాల్లో లభించిన భూముల డాక్యుమెంట్లు, నగదు లావాదేవీలపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. లక్ష్మీ భాస్కర్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తూ బినామీ ఆస్తుల కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, లక్ష్మీ భాస్కర్‌ను కస్టడీకి తీసుకుని మరింత విచారణ చేయాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల కొనుగోలు, నగదు లావాదేవీలు, ఇతర వ్యక్తులతో ఉన్న ఆర్థిక సంబంధాలపై కస్టడీ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇటీవల లక్ష్మీ భాస్కర్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.80 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గతంలో నిమ్స్‌లో వైద్యుడిగా పనిచేసిన సమయంలో ఓ రోగి నుంచి డబ్బులు తీసుకుంటూ నిమ్స్ డైరెక్టర్‌కు పట్టుబడి ఉద్యోగాన్ని కోల్పోయినట్లు కూడా సమాచారం.

ఆ తర్వాత 2007లో తిరిగి నిమ్స్‌లో ఉద్యోగంలో చేరిన లక్ష్మీ భాస్కర్ తరచూ విదేశీ పర్యటనలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రిలో అవకాశమున్న వివిధ సందర్భాల్లో డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. తాజా సోదాలతో ఈ కేసులో మరిన్ని ఆర్థిక లావాదేవీలు, బినామీ ఆస్తులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై ఏపీ సర్కార్ సీరియస్.. 45 మందిపై చర్యలు?

అక్టోబరు 4న తూప్రాన్‌కు అమిత్ షా.. అమూల్ ప్లాంట్‌కు భూమిపూజ

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Instagram: DigitalPrimeNews
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews

 

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube