నేటితో వందేమాతరం గేయానికి 150 ఏళ్లు! దేశభక్తిని ప్రతిబింబించే గేయం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి.
నేటితో వందేమాతరం గేయానికి 150 ఏళ్లు!
దేశభక్తిని ప్రతిబింబించే గేయం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. 1875 నవంబర్ 7న బంకిమ్ చంద్ర ఛటర్జీ ఈ గేయాన్ని రచించారు. స్వాతంత్ర్య సమరయోధులను ప్రేరేపించిన ఈ గేయం భారతీయులలో దేశభక్తిని నింపింది.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి ఏడాది పాటు అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు రాష్ట్రాలు కూడా ఈ వేడుకల్లో భాగమవుతున్నాయి.
తెలంగాణలో ఈ వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలలో ఉదయం 10 గంటలకు ‘వందేమాతరం 150 వసంతాల ఉత్సవాలు’ ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్, బీజేపీ జనరల్ సెక్రటరీ గౌతం రావు మరియు పార్టీ నేతలు, శ్రేణులు హాజరుకానున్నారు.
దేశభక్తి గీతం వందేమాతరం పట్ల మళ్లీ గౌరవం, ఆరాధన పునరుద్ధరించే రోజు ఇది అని కేంద్రం ప్రకటించింది.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!
#DigitalPrimeNews #TeamIndia #WomensWorldCupFinal #IndiaVsAustralia #HarmanpreetKaur #JemimahRodrigues #WomenCricketHistory #CricketNews #TeluguNews #SportsUpdates #BreakingNews

COMMENTS