తెలంగాణకు కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. 9 రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్పులు

తెలంగాణకు కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. 9 రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్పులు

Homeతెలంగాణ

తెలంగాణకు కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. 9 రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్పులు

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియామకం… 9 రాష్ట్రాల్లో కీలక మార్పులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలకు కొ

మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు.. పార్లమెంట్‌లో కేంద్రం కీలక అడుగు?
మోదీ క్యాబినెట్‌లో భారీ మార్పులా?.. నిర్మల సహా నలుగురికి ఉద్వాసన?.
ఏపీకి భారీ వరం.. NH-42 అభివృద్ధికి రూ.679.71 కోట్ల మంజూరు

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియామకం… 9 రాష్ట్రాల్లో కీలక మార్పులు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం (మార్చి 5) రాత్రి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ ఆకస్మిక రాజీనామా తర్వాత కేంద్రం పలు రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చింది. ఈ మార్పుల్లో భాగంగా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణ గవర్నర్‌గా నియమించింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జులైలో జిష్ణుదేవ్ వర్మ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాదిన్నర పాటు తెలంగాణ గవర్నర్‌గా సేవలందించిన ఆయన ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయ్యారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బదిలీ చేయడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఈ మార్పుల్లో భాగంగా నాగాలాండ్‌కు నందకిశోర్ యాదవ్‌ను కొత్త గవర్నర్‌గా నియమించారు. బిహార్‌కు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్‌ను గవర్నర్‌గా నియమించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరంజిత్ సింగ్ సంధు నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ ఎల్‌జీగా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాను లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బదిలీ చేశారు. లడఖ్ ఎల్‌జీగా ఉన్న కవీందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. అలాగే తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

తెలంగాణకు కొత్తగా నియమితులైన శివప్రతాప్ శుక్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. ఆయన 1952 ఏప్రిల్ 1న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పుర్ జిల్లా రుద్రాపూర్ గ్రామంలో జన్మించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన ఆయన విద్యార్థి దశలోనే ఏబీవీపీ సంస్థలో కీలక పాత్ర పోషించారు. 1983లో భారతీయ జనతా పార్టీలో చేరిన శుక్లా 1989లో గోరఖ్‌పుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

తర్వాత వరుసగా పలు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై యూపీ ప్రభుత్వంలో విద్యాశాఖ సహాయమంత్రిగా కూడా పనిచేశారు. 2016లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కాగా, 2017లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. తాజాగా తెలంగాణ గవర్నర్‌గా బదిలీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube