వైద్య విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం – మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం

వైద్య విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం – మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం

Homeఆంధ్రప్రదేశ్

వైద్య విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం – మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం

అమరావతి, జులై 1: డాక్టర్స్ డే రోజునే విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడాన్ని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ త

దుర్గా మాత శోభాయాత్రలో వివాదం – బ్యాండ్ అడ్డుకున్నారు సీఐ, భవానీలు ధర్నాకు
భారీ ఉగ్ర కుట్ర భగ్నం – హర్యానాలో 300 కేజీ RDX సీజ్.
ఇరాన్ యుద్ధంపై అమెరికా-ఇజ్రాయెల్ అభిప్రాయ భేదాలు

అమరావతి, జులై 1: డాక్టర్స్ డే రోజునే విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడాన్ని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడికి దిగడమే కాకుండా, అరెస్టులు చేయడం అత్యంత అమానుషమని ఆయన వ్యాఖ్యానించారు.

ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ – “విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి, MCI పరీక్షలో ఉత్తీర్ణులై, ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసిన విద్యార్థులకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్ ఇవ్వడంలో ఇబ్బంది ఏమిటి? అని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి ధ్రువీకరణలు తెచ్చుకున్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

“తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని తమ పిల్లలకు వైద్య విద్య ఇచ్చారు. ఇప్పుడు ఆ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కానీ ప్రభుత్వం మాత్రం ఆలస్యం చేస్తోంది. ఇది తీవ్రంగా ఖండించదగిన అంశం” అని అన్నారు.

అలాగే, ఆరోగ్యశాఖ మంత్రి వ్యాఖ్యలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. “బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం? విద్యార్థులు తమ హక్కుల కోసమే పోరాడుతున్నారు” అని వ్యాఖ్యానించారు.

సురేష్ ప్రభుత్వం తీసుకున్న వైద్యం రంగానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలపై విమర్శలు చేస్తూ, వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను విస్తరించేందుకు కేంద్రం ఇచ్చిన సీట్లను తిరస్కరించారని ఆరోపించారు. “ఇది కావాలనే విద్యార్థులను ఇబ్బంది పెట్టే కుట్రే” అని ఆరోపించారు.

“తక్షణమే విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించి, అరెస్టయిన వారిని విడుదల చేయాలి. ఆలస్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి” అని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube Channel.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube