ఏపీలో కొత్తగా ఆ రెండు ఎయిర్‌పోర్టులు ఫిక్స్.. కేంద్రం కీలక ప్రకటన, ఆ జిల్లాల దశ తిరిగినట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగంలో కొత్త దారులు తెర
ఏపీలో కొత్తగా ఆ రెండు ఎయిర్‌పోర్టులు ఫిక్స్.. కేంద్రం కీలక ప్రకటన, ఆ జిల్లాల దశ తిరిగినట్లే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగంలో కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే ఓర్వకల్లు, భోగాపురం వంటి విమానాశ్రయాలు అభివృద్ధి చెందుతుండగా.. ఇప్పుడు మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కుప్పం, దగదర్తి విమానాశ్రయాల అభివృద్ధి అంశంపై కేంద్రం రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన చేసింది.
రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రం నుంచి వారానికి సుమారు 1,194 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఓర్వకల్లు విమానాశ్రయం ఇప్పటికే 2021 నుంచే అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగంగా సాగుతోందని స్పష్టం చేశారు.
కుప్పం ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్థలాన్ని కేటాయించేందుకు దరఖాస్తు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇక దగదర్తి విమానాశ్రయం విషయంలో 2018లో రాష్ట్రం ఒప్పందం చేసుకున్నప్పటికీ, తరువాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం కొత్త డెవలపర్‌ను ఎంపిక చేసి, భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. దీనికి సంబంధించి అన్ని అనుమతులు, ఆర్థిక వనరులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.
ఇక ఉడాన్ 5.5 పథకం కింద కేంద్రం సీప్లేన్ సేవలు ప్రారంభించేందుకు ముందడుగు వేసింది. రుషికొండ, అరకు, లంబసింగి, కాకినాడ, కోనసీమ, నర్సాపూర్, ప్రకాశం బ్యారేజీ, తిరుపతి, గండికోట, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో సీప్లేన్‌లు నడిపేందుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI)లు జారీ చేసినట్టు చెప్పారు. DGCA భద్రతా నిబంధనల్లో మార్పుల ద్వారా అనుమతుల ప్రక్రియ సులభతరం చేసినట్టు పేర్కొన్నారు.
ఈ ప్రకటనలతో ఏపీ రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధికి గణనీయమైన ప్రోత్సాహం లభించనుంది. ముఖ్యంగా కుప్పం, దగదర్తి విమానాశ్రయాలు పూర్తవుతే, ఆ ప్రాంతాల అభివృద్ధికి గేమ్‌చేంజర్‌లుగా మారే అవకాశం ఉంది.
ఏపీలో కొత్తగా ఆ రెండు ఎయిర్‌పోర్టులు ఫిక్స్.. కేంద్రం కీలక ప్రకటన, ఆ జిల్లాల దశ తిరిగినట్లే.
Digital Prime News మీకు తెలంగాణ, తెలుగు సినిమా, రాజకీయాలు, యువత అంశాల్లో తాజా వార్తలు అందిస్తుంది. మరిన్ని వార్తల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి!
Visit Us: www.digitalprimenews.in
Follow Us on Social Media:
▶️ YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS