గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్ గాంధీకి మూడో వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రొటోకాల్ వివాదం పూర్తి వివరాలు. దేశ రాజధా
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్ గాంధీకి మూడో వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రొటోకాల్ వివాదం పూర్తి వివరాలు.
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రొటోకాల్ అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మూడో వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఉద్దేశపూర్వక అవమానమేనని ఆరోపిస్తూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడింది.
సోమవారం జరిగిన గణతంత్ర వేడుకలకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే, నిబంధనల ప్రకారం లోక్‌సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉండగా, ఆయనను మూడో వరుసలో కూర్చోబెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొదటి వరుసలో కూర్చోవడం వివాదానికి మరింత బలం చేకూర్చింది.
ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నేతకు హక్కుగా దక్కాల్సిన గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం కాపాడలేకపోయిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతకు ప్రత్యేక స్థానం ఉంటుందని, ఒక రకంగా ఆయనను ‘షాడో ప్రధానిగా’ పరిగణిస్తారని అన్వర్ గుర్తుచేశారు. అలాంటి కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తిని అధికారిక కార్యక్రమంలో పక్కన పెట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు.
ఇటీవలి కాలంలో ప్రతిపక్ష నాయకుల పట్ల ఇలాంటి వ్యవహారం తరచుగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎప్పటినుంచో కొనసాగుతున్న ప్రజాస్వామ్య సంప్రదాయాలను మోదీ ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన వేడుకల్లో కూడా రాజకీయ పక్షపాతం ప్రదర్శించడం దురదృష్టకరమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
ఈ వివాదంపై ఇప్పటివరకు బీజేపీ అధికారికంగా స్పందించలేదు. అయితే, రాహుల్ గాంధీకి మూడో వరుసలో సీటు కేటాయించిన వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిపక్ష గౌరవం, ప్రొటోకాల్ నిబంధనల అమలు అంశాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS