టీ20 వరల్డ్ కప్ 2026కు 15 మంది సభ్యులతో టీమిండియా స్క్వాడ్ ప్రకటించారు. సూర్యకుమార్ కెప్టెన్, అక్షర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. BCCI announces Ind
టీ20 వరల్డ్ కప్ 2026కు 15 మంది సభ్యులతో టీమిండియా స్క్వాడ్ ప్రకటించారు. సూర్యకుమార్ కెప్టెన్, అక్షర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.
BCCI announces India’s squad for T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026కు టీమిండియా అధికారికంగా స్క్వాడ్‌ను ప్రకటించింది. బీసీసీఐ శనివారం (డిసెంబర్ 20) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును వెల్లడించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఫామ్, ఫిట్నెస్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. ఈసారి టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండగా, అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్‌గా కీలక బాధ్యతలు అప్పగించారు.
ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టడం సెలక్టర్ల పెద్ద నిర్ణయంగా మారింది. అదే సమయంలో ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్‌కు వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కింది. మరోవైపు సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపికైన జితేష్ శర్మను ఈసారి వరల్డ్ కప్ జట్టులో తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చారు.
బౌలింగ్ విభాగంలో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానాలను ఎంపిక చేశారు. స్పిన్ విభాగాన్ని వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ నడిపించనుండగా, ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టుకు సమతూకం అందించనున్నారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కొనసాగనున్నారు.
బ్యాటింగ్ విభాగంలో యువతకు పెద్ద పీట వేశారు. అభిషేక్ శర్మ తొలిసారి ఐసీసీ ఈవెంట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రింకూ సింగ్ ఫినిషర్ పాత్రలో కీలకంగా మారనున్నాడు. మొత్తం మీద అనుభవం, యువత కలయికతో సమతూకమైన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
2026 టీ20 వరల్డ్ కప్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుండగా, ప్రారంభం మరియు ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. మొత్తం 20 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొననున్నాయి.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS