సిరియాలో ISIS స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు

సిరియాలో ISIS స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు

Homeఅంతర్జాతీయం

సిరియాలో ISIS స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు

సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇది యుద్ధం కాదు, ప్రతీకార చర్య మాత్రమేనని రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్ స్పష్టం చ

ఇరాన్ ఒప్పందంపై తొందరలేదు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం
హార్ముజ్ వద్ద ఇరాన్ నౌక స్వాధీనం.. అమెరికా దాడి

సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇది యుద్ధం కాదు, ప్రతీకార చర్య మాత్రమేనని రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్ స్పష్టం చేశారు.

US Air Strikes Target ISIS Bases in Syria: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాద స్థావరాలపై అమెరికా సైన్యం తీవ్ర వైమానిక దాడులు చేపట్టింది. ఇటీవల సిరియాలో ఉన్న అమెరికా సైనిక సిబ్బందిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడులు యుద్ధ చర్యలు కావని, పూర్తిగా ప్రతీకార చర్యలేనని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్ వెల్లడించారు. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక ఇవ్వడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే, అమెరికా సైనికులపై దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టంగా హెచ్చరించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే ‘ఆపరేషన్ హాక్‌ఐ’ (Operation Hawkeye) పేరుతో ఈ దాడులు నిర్వహించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. సిరియాలోని సెంట్రల్ ప్రాంతాల్లో ఉన్న ఐఎస్ఐఎస్ ఫైటర్లు, ఆయుధ గోదాములు, లాజిస్టిక్ కేంద్రాలు, మౌలిక వసతులను టార్గెట్ చేసి వైమానిక దాడులు చేసినట్లు అమెరికా డిఫెన్స్ అధికారులు తెలిపారు.

రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్ మాట్లాడుతూ, “ఇది యుద్ధం కాదు… ఇది ప్రతీకారం మాత్రమే. మా శత్రువులను మేం వేటాడాం. వారికి తగిన శిక్ష విధించాం. ఈ తరహా దాడులు అవసరమైతే కొనసాగుతాయి” అని అన్నారు. అమెరికా దళాల భద్రతకు ఎలాంటి ముప్పు వచ్చినా కఠినంగా స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల సెంట్రల్ సిరియాలోని పల్పైరా ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక ఇంటర్‌ప్రిటర్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆ ఘటన తర్వాతే అమెరికా వైమానిక దాడులు మరింత ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఐఎస్ఐఎస్‌కు చెందిన కీలక స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

ప్రస్తుతం సిరియాలో అమెరికాకు చెందిన సుమారు వెయ్యి మంది సైనికులు ఇంకా మోహరించి ఉన్నారు. ఐఎస్ఐఎస్ పునరుత్థానాన్ని అడ్డుకోవడం, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటం లక్ష్యంగా ఈ దళాలు పనిచేస్తున్నాయి. అమెరికా చర్యలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని అమెరికా స్పష్టం చేస్తోంది.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube