Hyderabad Water Supply Disruption in Several Areas Due to Pipeline Leak

హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం!

Homeతెలంగాణ

హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం!

హైదరాబాద్‌లో ప్రధాన పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఎర్రగడ్డ, అమీర్‌పేట, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. హైదరాబాద్ నగర

స్కూల్ బస్సులపై ఆర్టీవో కొరడా.. 6 బస్సులకు చలాన్లు
జలమండలి జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు.. కోట్ల ఆస్తులు వెలుగులోకి
హైదరాబాద్‌లో ట్రంప్ రోడ్.. తెలంగాణకు థ్యాంక్స్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు!

హైదరాబాద్‌లో ప్రధాన పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఎర్రగడ్డ, అమీర్‌పేట, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

హైదరాబాద్ నగర ప్రజలకు జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు చెందిన లింగంపల్లి–బంజారాహిల్స్ 1000 ఎంఎం ప్రధాన పైప్‌లైన్‌లో భారీ లీకేజీ ఏర్పడటంతో అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని తెలిపారు. ప్రజలు అవసరమైన మేరకు నీటిని పొదుపుగా వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

లీకేజీ మరమ్మత్తు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని, పనులు పూర్తైన వెంటనే యథావిధిగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి పనుల పురోగతిని సమీక్షించి, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్‌మిషన్ విభాగాల అధికారులు సమన్వయంతో మరమ్మత్తులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని కూడా సూచించారు.

ఈ మరమ్మత్తుల ప్రభావం ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట, వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడ, సనత్‌నగర్, నిమ్స్ పరిసరాలు, బంజారాహిల్స్, వెంకటగిరి, బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో కనిపించనుంది. ఆయా ప్రాంతాల వినియోగదారులు ముందుగానే తాగునీటిని నిల్వ చేసుకోవడంతో పాటు అవసరానికి మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు. మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా సాధారణ స్థితికి తీసుకువస్తామని జలమండలి వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

మెటా వెనక్కి తగ్గింది.. ఇన్‌స్టాగ్రామ్ వివాదాస్పద AI ఫీచర్ తొలగింపు!

రుతుపవనాలు బలహీనం.. ఏపీలో పెరిగిన ఎండలు, అక్కడక్కడా వర్షాలు 

ఇరాన్‌కు అమెరికా 24 గంటల అల్టిమేటం.. హోర్ముజ్‌పై తుది హెచ్చరిక!

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube