హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం నేపథ్యంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ కీలక గైడ్‌లైన్స్ విడుదల హైదరాబాద్ గుల్జార్‌హౌస్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం న
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం నేపథ్యంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ కీలక గైడ్‌లైన్స్ విడుదల
హైదరాబాద్ గుల్జార్‌హౌస్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్స్, మల్టీ స్టోరీ బిల్డింగులు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, హోటల్స్ వంటి ప్రజాసౌకర్యాలకు విద్యుత్ భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించింది. విద్యుత్ చట్టం–2003, నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్–2023, నేషనల్ బిల్డింగ్ కోడ్–2016 ప్రకారం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
గైడ్‌లైన్‌లు:
విద్యుత్ పనులు లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్లు, నైపుణ్యం ఉన్న వర్కర్ల ద్వారానే జరగాలి
సురక్షిత ఇన్‌స్టాలేషన్ కోసం సరైన కెబుల్ సైజులు తప్పనిసరి
ఎలక్ట్రికల్ పరికరాలకు సర్టిఫికేట్ ఉన్న సామగ్రి వాడాలి
ఫైర్ ప్రొటెక్షన్ పరికరాలు, ఐసోలేషన్ స్విచ్‌లు తప్పనిసరి
15 ఏళ్లు పైబడిన వైరింగ్ పూర్తిగా మార్చాలి
ఈ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే విద్యుత్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Nakashatra Agency-instagram reel
COMMENTS