పటాన్చెరు నియోజకవర్గం, అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని నర్రెగూడెం చౌరస్తా వద్ద ఫుట్‌పాత్‌పై ఉన్న టీ స్టాల్‌లో గ్యాస్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిం
పటాన్చెరు నియోజకవర్గం, అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని నర్రెగూడెం చౌరస్తా వద్ద ఫుట్‌పాత్‌పై ఉన్న టీ స్టాల్‌లో గ్యాస్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి నీటితో మంటలను ఆర్పివేశారు. ఊహించని ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు భయానక వాతావరణం నెలకొంది.

COMMENTS