గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై ప్రత్యక్ష సాక్షి వేదన హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై ప్రత్యక్ష
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై ప్రత్యక్ష సాక్షి వేదన
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ):
గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి గాజుల వ్యాపారి మీర్ జాహెద్ ఆవేదన వ్యక్తం చేశారు.
“ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 17 మంది ప్రాణాలు కళ్ల ముందే పోయాయి. తెల్లవారుజామున మసీదులో నుంచి వస్తుండగా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ఓ భవనాన్ని చూపించి పొగలు వస్తున్నాయని చెప్పాడు. వెంటనే మేము ఐదుగురు వెళ్లాం. లోపల ఇద్దరు మహిళలు ‘దయచేసి కాపాడండి’ అని అరుస్తుండగా గోడకు రంధ్రం చేసి వెళ్లాం. కానీ వారిని కాపాడలేకపోయాం” అని బాధతో చెప్పారు.
ఈ ప్రమాదం ఆ ప్రాంత ప్రజలను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది.

Websoft technologies-java Full Stack

COMMENTS