కవితపై సంచలన ఆరోపణలు..రూ.2వేల కోట్ల విలువచేసే భూ కబ్జా ? హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయి తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్
కవితపై సంచలన ఆరోపణలు..రూ.2వేల కోట్ల విలువచేసే భూ కబ్జా ?
హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయి తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవితపై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. హైదరాబాద్ బాలానగర్ మండల పరిధిలోని ఐడీపీఎల్ (IDPL)కు చెందిన ప్రభుత్వ భూమిలో భారీ భూకబ్జా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్, ఏవీ రెడ్డి లు ఈ వ్యవహారంలో భాగస్వాములని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వారు తెలిపారు. ఇప్పటికే ఫ్లాట్లు నిర్మించి అమ్మకాలు మొదలయ్యాయని వారు ఈటల దృష్టికి తీసుకెళ్లారు.
కవిత భర్త అనిల్,ఏ వీ రెడ్డిలు ఓవర్‌లాపింగ్ సర్వే నంబర్లను ఆధారంగా చేసుకుని భూకబ్జా జరిపారని స్థానికులు ఆరోపించారు. ఇందులో ఏవీ రెడ్డి కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై“మేము హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ వంటి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదు” అని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఈ భూమిని కాపాడి, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ప్రజోపయోగ నిర్మాణాలకు వినియోగించాలని వారు ఈటల రాజేందర్‌ను కోరారు. వారి ఫిర్యాదు స్వీకరించిన ఈటల రాజేందర్, ప్రభుత్వ భూమిని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ‘జాగృతి’ పేరిట ప్రజల్లోకి వెళ్తున్న ఈ సమయంలో, కవితపై భూకబ్జా ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఫిర్యాదుల వెనుక ఈటల రాజేందర్ వ్యూహం ఉందా అనే ప్రశ్న కూడా చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వ్యవహారం కావడంతో ఆయన సీరియస్ గా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలానగర్ భూకబ్జా వ్యవహారం త్వరలోనే పెద్ద రాజకీయ తుఫాన్‌కు దారితీయవచ్చని అంచనా వేస్తున్నారు. కవిత, అనిల్, ఏవీ రెడ్డి పేర్లు ఈ వ్యవహారంలో వినిపించడం తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది.

COMMENTS