మహారాష్ట్రలోని థానే జిల్లా, భివండీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిచ్ ల్యాండ్ కాంపౌండ్ వద్ద ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు వేగంగా చుట్టు
మహారాష్ట్రలోని థానే జిల్లా, భివండీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిచ్ ల్యాండ్ కాంపౌండ్ వద్ద ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు వేగంగా చుట్టుపక్కల ఉన్న గోదాములకు వ్యాపించాయి. ఈ ఘటనలో సుమారు 22 గోదాములు పూర్తిగా కాలిపోయినట్లు జాతీయ మీడియాల కథనాలు పేర్కొన్నాయి.
మంటలు భారీగా ఎగిసిపడి, దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు నాలుగు నుంచి ఐదు అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాలిపోయిన గోదాములలో రసాయనాలు, ప్రింటింగ్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రోటీన్ పౌడర్లు, సౌందర్య సాధనాలు, బట్టలు, బూట్లు, మండప అలంకరణ వస్తువులు, ఫర్నిచర్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గోదాములలో రసాయనాలు ఉండటం వల్ల మంటలు మరింత వేగంగా వ్యాపించడంతో వాటిని అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సవాల్‌గా మారింది.
ఈ ప్రమాదంలో భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరిగిందా లేదా అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

COMMENTS